https://oktelugu.com/

Kalki Trailer: కల్కి ట్రైలర్ లీక్: హైలెట్స్ ఇవే.. నిడివి ఎంతంటే?

Kalki Trailer: బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, రానా వంటి స్టార్ క్యాస్ట్ సినిమాలో కీలక రోల్స్ చేస్తున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 10, 2024 / 02:15 PM IST

    Kalki Trailer Leaked

    Follow us on

    Kalki Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898 AD . మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అమితాబ్ అశ్వద్ధామ గా కనిపించనున్నారు. ఇటీవల అశ్వద్ధామ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఇక బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, రానా వంటి స్టార్ క్యాస్ట్ సినిమాలో కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇప్పటికే కల్కి టీం జోరుగా చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భైరవ జీవితంలో అతి ప్రాముఖ్యమైన బుజ్జి ని పరిచయం చేశారు. భారీ ఈవెంట్ నిర్వహించి బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశారు.

    Also Read: NBK 109 ఫస్ట్ గ్లింప్స్ రివ్యూ: దయలేని అసురుడు వీడు… బాలయ్య లుక్ కేక!

    బుజ్జి అండ్ భైరవ పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియో యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న కల్కి ట్రైలర్ నేడు విడుదల కాబోతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సినిమా ట్రైలర్ లాంచ్ కాబోతుంది. ముందుగా కల్కి ట్రైలర్ థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత ఆన్లైన్ లో లాంచ్ చేస్తారు. అయితే ఈ ట్రైలర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

    Also Read: Suriya: సూర్య కొత్త సినిమాను పుష్ప తో ఎందుకు పోలుస్తున్నారు…

    కల్కి ట్రైలర్ దాదాపు 2 నిమిషాల 30 సెకన్లు రన్ టైం తో ఉండబోతుంది. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ లు ట్రైలర్ లో ఉన్నాయని తెలుస్తుంది. ప్రధాన పాత్రలతో పాటు కీలక రోల్స్ పరిచయం చేస్తారట. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్ లో హైలెట్స్ అట. ఒక కొత్త ప్రపంచం స్క్రీన్ పై నాగ్ అశ్విన్ ఆవిష్కరించాడని అంటున్నారు. ఇప్పటికే కల్కి మూవీ పై భారీగా హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. కల్కి ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేదిగా ఉంటుందని అంటున్నారు.