Rashmika Mandanna: క్యూట్ బేబీ రష్మిక మండన్నా ఇటీవల బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ వరుస సినిమా ఛాన్స్ లను అందుకుంటూ ముందుకు పోతుంది. ప్రస్తుతానికి అయితే, ఆమె ఈ ఏడాది రెండు హిందీ చిత్రాల్లో నటించింది. ఇక ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాదే రిలీజ్ కానున్నాయి. వాటిల్లో రష్మిక మొదటి హిందీ సినిమా ‘మిషన్ మజ్ను’. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో, ఈ చిత్రం పై హిందీలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఫస్ట్ కాఫీ కూడా చూసుకున్నారు. అవుట్ ఫుట్ అద్భుతంగా ఉందని మేకర్స్ పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమా వచ్చే వేసవిలో అనగా మే 13, 2022న రిలీజ్ కాబోతుందని తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. అలాగే రష్మిక నటిస్తున్న రెండో హిందీ సినిమా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘గుడ్ బై’ సినిమా.
కాగా ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది వేసవిలో అనగా మే 24, 2022న రిలీజ్ కాబోతుంది. ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు గానీ, దాదాపు ఇదే డేట్ ను ఖరారు చేశారని బాలీవుడ్ మీడియా రాసుకొస్తోంది. మొత్తమ్మీద వారం గ్యాప్ లోనే రష్మిక నుంచి రెండు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందుకే, హిందీలో రష్మికకు ఫుల్ క్రేజ్ దక్కింది.
ఇంతవరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అలాగే ఆమె ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. అప్పుడే ఆమె డేట్లు కోసం బాలీవుడ్ స్టార్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లెక్కన రష్మికకు బాలీవుడ్ లాంగ్ లైఫ్ ఉన్నట్టే. పైగా ఆమె పాన్ ఇండియా లెవల్లో స్టార్ డమ్ తెచ్చుకున్నట్టే. ఇక ప్రస్తుతం రష్మిక మరో రెండు హిందీ సినిమాలను ఒప్పుకుంది.
వాటి వివరాలు పూర్తిగా తెలియదు గానీ, స్టార్ హీరోల సినిమాలు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకే, ఈ మధ్య రష్మిక, తెలుగు కంటే కూడా.. ఎక్కువగా హిందీ సినిమాల పైనే ఫుల్లుగా ఫోకస్ పెట్టింది. కాకపోతే తెలుగులో ఆమె గతంలో ఒప్పుకున్న సినిమాలు ‘పుష్ప’, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఉన్నాయి.
Also Read: Tollywood: ఫుల్ ఫామ్ లో దూసుకువెళ్తున్న టాలీవుడ్ సీనియర్ హీరోలు…
ఏది ఏమైనా రష్మికకు హిందీలో క్రేజీ ఆఫర్లు రావడం విశేషమే. అన్నట్టు ఆమెకు ఇంకా వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కూరలో కరివేపాకు లాంటి రోల్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక, ఆరేళ్ళల్లోనే పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ అవ్వడం అంటే గ్రేటే.
Also Read: Actress Samantha: ఎక్కువ సమయం బెడ్ రూమ్ లో గడుపుతాను అంటున్న సమంత…