https://oktelugu.com/

Star Director : ఈ స్టార్ డైరెక్టర్ తీసిన రెండు సినిమాలు మంచి విజయాలను సాధించాయి..అయిన 10 ఏళ్లలో 2 సినిమాలు మాత్రమే చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేయాలి. ఇక దర్శకుడు ఒక సినిమా చేసిన వెంటనే మరో సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండే ప్రయత్నమైతే చేయాలి. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే ప్రేక్షకులు ఆ దర్శకుడిని మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి...

Written By: , Updated On : February 13, 2025 / 07:04 PM IST
Star Director

Star Director

Follow us on

Star Director : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు మంచి సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా క్వాలిటీ ఉండే సినిమాలను చేయడానికి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం…ఇక రాజమౌళి (Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ ఒక సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయాన్ని తీసుకొని ఆ సినిమాను చాలా చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. దీనివల్ల భారీ కలెక్షన్స్ రావడమే కాకుండా రాజమౌళి స్టాండర్డ్ అనేది పెరుగుతూ వస్తుంది… ఇక ఇదిలా ఉంటే ‘రన్ రాజా రన్’ (Run Raja Run) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సుజిత్(Sujeeth)… ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ని హీరోగా పెట్టి ఆయన చేసిన సాహో (Sahoo) సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజి (OG) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు. ఇక తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి కేవలం రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఇక ప్రభాస్ తో సాహో సినిమా చేయడానికి ఆయన కోసం ఐదు సంవత్సరాల పాటు బాహుబలి సినిమా పూర్తి చేసేంత వరకు వెయిట్ చేసి మరీ సాహో మూవీ చేసి రిలీజ్ చేశాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం అయిన రిలీజ్ అవుతుందా లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఈ గ్యాప్ లో ఆయన నానితో సినిమా చేయడానికి కూడా కమిట్ అయ్యాడు. సినిమా ఓపెనింగ్ కూడా జరుపుకుంది అయినప్పటికి ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది.

కారణం ఏదైనా కూడా సుజీత్ లాంటి స్టార్ డైరెక్టర్ వరుస సినిమాలను చేస్తూ ఇప్పుడు మార్కెట్ లో ఉండాలి. కానీ ఇలా అడపా దడపా సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకుల్లో ఆయనకు అంత మంచి గుర్తింపైతే ఉండదనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాలను విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…

ఇక మీదట సినిమాల విషయంలో అసలు లేట్ చేయకూడదని ఉన్నాడట. మరి తన తోటి దర్శకులందరు ఇప్పటికే ఐదారు సినిమాలను చేసి ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఇప్పటివరకు రెండు సినిమాలను రిలీజ్ చేసి తన కెరీర్ ని చాలా వరకు స్లోగా ముందుకు తీసుకెళ్తున్నాడనే చెప్పాలి…