Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. తేజ లాంటి దర్శకుడు ప్రస్తుతం చిన్న సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఒకప్పుడు మాత్రం ఆయన చిన్న సినిమాలతోనే పెద్ద విజయాలను అందుకున్నాడు. చాలామంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా తనకే దక్కుతోంది… ఇక ఏది ఏమైనా కూడా తేజ డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో నటించడం వల్ల ఒక ఇద్దరు నటులు వాళ్ల కెరియర్ని పోగొట్టుకున్నారు అనే విషయం మనలో చాలామందికి తెలియదు. అప్పటివరకు టాప్ హీరోయిన్ గా కొనసాగిన రాశి నిజం సినిమాలో విలన్ గోపీచంద్ పక్కన చేసి ఆ తర్వాత తన కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుంది…
మొదట్లో ఆమె క్యారెక్టర్ చాలా మంచిగా ఉంటుందని తేజ చెప్పారట. దాంతో ఆమె ఒప్పుకుంది ఇక సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఆమె విలన్ వైఫ్ గా చాలా బోల్డ్ గా కనిపిస్తూ, వల్గర్ డైలాగులు మాట్లాడుతూ చాలా అగ్రెసివ్ గా ఉండే పాత్ర అని చెప్పడంతో ఆమె చేయనని చెప్పిందట. అయినప్పటికి తేజ వినకుండా మీరు చేయాల్సిందే అని చెప్పడంతో ఒప్పుకున్న పాపానికి చేయక తప్పలేదని రాశి పాలు సందర్భాల్లో తెలియజేసింది…
ఇక ఇదే సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం ముందుగా మురళీమోహన్ గారిని తీసుకున్నారు. మురళీమోహన్ ఆ పాత్రలో నటించి మెప్పించినప్పటికి ఆయన అంత బాగా సెట్ అవ్వలేదనే ఉద్దేశ్యంతో తేజ తనను తీసేసి మళ్ళీ ప్రకాష్ రాజ్ ను పెట్టి షూట్ చేశాడు. మొత్తానికైతే మురళీమోహన్ కూడా ఆ తర్వాత నటుడి గా పెద్దగా రాణించలేకపోయాడు… మొత్తానికైతే వీళ్ళిద్దరి కెరియర్ తేజ వల్లనే నాశనం అయిపోయిందని వాళ్ళు చాలా సందర్భాల్లో తెలియజేశారు.
తేజ ఈ మూవీ తర్వాత నుంచి ఆయన పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాడు. 2018వ సంవత్సరంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తర్వాత ఆ ఫామ్ ని కొనసాగించలేక మరోసారి డీలా పడిపోయాడు… ఇక ప్రస్తుతం రానాతో చేస్తున్న ‘రాక్షస రాజా’ అనే సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఆయన ఒక కొత్త సబ్జెక్టుతో కొంతమంది కొత్త వాళ్ళను పరిచయం చేస్తూ మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…