Bigg Boss 9 finale voting: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) పూర్తి అవ్వడానికి సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సీజన్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ ని గ్రాండ్ ఫినాలే కి పంపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరి నిమిషం లో నిర్ణయం మార్చుకొని టాప్ 5 కంటెస్టెంట్స్ ని ఫినాలే వీక్ కి పంపించారు. నిన్న భరణి ఎలిమినేషన్ తర్వాత తనూజ, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, సంజన టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. గత వారం వరకు భరణి కి సంజన కంటే భారీ ఓటింగ్ నమోదు అవుతూ వచ్చింది. కానీ 14 వ వారం లో హౌస్ మేట్స్ అందరూ సంజన ని టార్గెట్ చేయడం తో, ఫ్యామిలీ ఆడియన్స్ ఆమెకు అన్యాయం జరుగుతుందని భావించి టాప్ 5 కి పంపించారు. భరణి ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ కి నచ్చలేదు కానీ, తక్కువ ఓటింగ్ పడడం వల్లే ఆయన ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది.
ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి 10 గంటల 30 నిమిషాల నుండి బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కి ఓటింగ్ మొదలైంది. ఆరంభం లో ఎవరు ముందు ఉన్నారు అనే విషయం పై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చనే నడుస్తోంది. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే తనూజ ప్రస్తుతానికి మూడు శాతం లీడింగ్ ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె తర్వాతి స్థానం లో కళ్యాణ్ కొనసాగుతున్నాడు. ఇద్దరి మధ్య ఓటింగ్ తేడా తక్కువగానే ఉంది. రాబోయే రోజుల్లో హౌస్ లో జరిగే పరిణామాల వల్ల ఈ ఓటింగ్ లో తేడా ఉండొచ్చు. ఇక మూడవ స్థానానికి అయితే చాలా గట్టి పోటీ నే నడుస్తుందని సమాచారం. ఇమ్మానుయేల్, మరియు డిమోన్ పవన్ లలో ఎవరో ఒకరు ఈ స్థానం లో కూర్చోవచ్చు. ప్రస్తుతానికి అయితే డిమోన్ పవన్ ని వేరే లెవెల్ ఓటింగ్ పడుతున్నట్టు తెలుస్తోంది.
గత వారంలో డిమోన్ పవన్ ఇమ్మానుయేల్ కంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ అందించాడు. అందుకే అతనికి ఓట్లు వరద లాగా పడుతున్నాయి. ఇక నాల్గవ స్థానం లో ఇమ్మానుయేల్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. డిమోన్ మరియు ఇమ్మానుయేల్ మధ్య ఓటింగ్ తేడా పెద్దగా లేదు. ఈ వారం ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగా అందిస్తారు అనే దానిపైనే, మూడవ స్థానం ఆధారపడి ఉంటుంది. ఇక చివరి స్థానం లో సంజన కొనసాగుతుంది అట. 11 వారం ఈమెకు గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. రీతూ చౌదరి పై బోల్డ్ కామెంట్స్ చేయడం, నాగార్జున తప్పు అని చెప్పినా ఒప్పుకోకపోవడం, బయటకి వెళ్ళిపోమంటే వెళ్ళడానికి ఈమె సిద్ధం అవ్వడం వంటివి ఆడియన్స్ కి బాగా నచ్చింది. అప్పటి నుండి ఈ గ్రాఫ్ చిన్నగా పెరుగుతూ వచ్చి టాప్ 5 లోకి వెళ్లేలా చేసింది. ప్రస్తుతానికి అయితే టాప్ 5 ఆర్డర్ ఇది, రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ ఆర్డర్ మారొచ్చు.