Homeఎంటర్టైన్మెంట్KGF Chapter 2: 'కేజీఎఫ్ 2'కు తెలంగాణ వరం.. కారణం ఆయనే !

KGF Chapter 2: ‘కేజీఎఫ్ 2’కు తెలంగాణ వరం.. కారణం ఆయనే !

KGF Chapter 2: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకి టికెట్ రేట్లును పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్ 2’ సినిమా యూనిట్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

KGF Chapter 2
KGF Chapter 2

‘కేజీఎఫ్ 2’ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని తాజాగా తెలంగాణ సర్కార్ జీవో జారీ చేయడం విశేషం. కాకపోతే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రేంజ్ లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీలు లేదు. మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు, ఏసీ థియేటర్లో 30 రూపాయలను మాత్రమే పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం షరతు పెట్టింది.

Also Read: Tollywood No 1 Hero: టాలీవుడ్ నెంబర్ 1 హీరో అతనే అట.. తేల్చి చెప్పిన సెన్సేషనల్ సర్వే

పైగా ఈ సినిమా విడుదలైన 4 రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్ ను ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో, చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. నిజానికి తెలంగాణలో ‘కేజీఎఫ్ 2’కి ప్రభుత్వం నుంచి ఇంత సపోర్ట్ వస్తోందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే, అనూహ్యంగా కేజీఎఫ్ 2 పై తెలంగాణ ప్రభుత్వం ప్రేమ చూపించడానికి కారణం కేటీఆర్.

కేటీఆర్ గతంలో కొన్ని సభల్లో కూడా కేజీఎఫ్ 2 సినిమాలోని హీరో డైలాగ్స్ ను తనకు అనుగుణంగా చెప్పారు. పైగా తనకు కేజీఎఫ్ 2 చిత్రం చాలా బాగా నచ్చింది అని కేటీఆర్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు కేజీఎఫ్ 2కి దక్కిన వరం వెనుక కేటీఆర్ హస్తం ఉంది. అభిమానంతో ఈ సినిమా తన స్థాయిని పెంచుకుంటూ పోతుంది.

KGF Chapter 2
KGF Chapter 2

యూఎస్ లో కూడా ఈ సినిమాకి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే.. ఇది ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది.

అందుకే, దేశంలోని అన్ని పరిశ్రమల్లో కేజీఎఫ్ 2 చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించే విధంగా ఈ చిత్రానికి బుకింగ్స్ జరుగుతున్నాయి.

Also Read:Central/State Governments: కేంద్రంతో రాష్ట్రాలు ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

4 COMMENTS

  1. […] CM KCR: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం కొనసాగుతోంది. వరి ధాన్యం విషయంలో రెండు పార్టీలు తగ్గేదేలే అంటున్నాయి. రైతులను మధ్యలో ఉంచుతూ ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన బీసీ విద్యావంతుల సదస్సులో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. […]

  2. […] CM KCR – Paddy Issue: తెలంగాణలో ప్రస్తుతం వరిధాన్యంపైనే రాజకీయం నడుస్తోంది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోరాటం మొదలు పెట్టాయి. దీంతో ధాన్యం కొనుగోలుపై రైతులకు ఆందోళన నెలకొంది. తమ ధాన్యం కొంటారా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో దీక్ష చేపట్టిన కేసీఆర్ కేంద్రానికి ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ విధించారు. దీంతో పరిస్థితి సై అంటే సై అనే స్థాయికి చేరింది. ఈ క్రమంలో రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు గండం పట్టుకుంది. […]

  3. […] Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్ ప్రస్తుతం మెగా అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఈ ట్రైలర్ లో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు మీద ఎమోషనల్ సీన్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ముఖ్యంగా మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్.. ఇక దేవాలయాల నేపథ్యంలో చిరు చెప్పే డైలాగ్, అదే విధంగా చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular