తెలియని దానిలో వేలు పెడుతున్నావన్నారు: అనుపమా

అనుపమా పరమేశ్వరన్‌. పుట్టింది కేరళలో అయినా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి. ‘ప్రేమమ్‌’ అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుందామె. కేరళలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్‌ అయింది. తెలుగు ప్రేమమ్‌తో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఆమె ‘అఆ’లో నెగిటివ్‌ రోల్‌ చేసింది. ఆపై, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘తేజ్ ఐ లవ్ యు’, ‘శతమానం భవతి’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో సెటిలైంది. Also […]

Written By: Neelambaram, Updated On : August 7, 2020 9:44 pm
Follow us on


అనుపమా పరమేశ్వరన్‌. పుట్టింది కేరళలో అయినా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి. ‘ప్రేమమ్‌’ అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుందామె. కేరళలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్‌ అయింది. తెలుగు ప్రేమమ్‌తో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఆమె ‘అఆ’లో నెగిటివ్‌ రోల్‌ చేసింది. ఆపై, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమకోసమే’, ‘తేజ్ ఐ లవ్ యు’, ‘శతమానం భవతి’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో సెటిలైంది.

Also Read: మా ఇంట్లో నలుగురికి కరోనా వచ్చింది : చిరంజీవి

ఇక్కడ మంచి పేరు రావడంతో తమిళ్‌, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే, మాతృభాష మలయాళంలో మాత్రం ఆమె ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పటిదాకా రెండు చిత్రాలే చేసింది. ప్రస్తుతం మరో మూవీలో నటిస్తోంది. అలాగని అవకాశాలు లేవని కాదు.. చాన్స్‌లు వస్తున్నా సరే మలయాళానికి దూరంగా ఉందామె. ఎవరికైనా ప్రాంతీయ అభిమానం ఉంటుంది. సొంత రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకోవాలని చూస్తారు. అవసరం అయితే ఇతర భాషా చిత్రాలను వదులుకుంటారు.

కానీ, ఈ కేరళ కుట్టి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. మాతృభాషకు కావాలనే దూరమైందామె. ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. తన మనసు గాయ పడడం వల్లే సొంత భాషకు దూరంగా ఉన్నానని చెప్పిందీ చిన్నది. తన మనసు ఎందుకు నొచ్చుకుందో కూడా ఆమెనే చెప్పింది. తొలి మూవీ ప్రేమమ్‌లో నటించిన అనుపమ ఆ మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌ ‌‌‌కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే, మూవీలో చిన్న పాత్ర చేసిన తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది అని విమర్శించారట. అయితే, వాటిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోవడంతో తనపై అహంకారి అని ముద్ర వేసి సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ చేశారని చెప్పింది.

Also Read: రమ్యకృష్ణ దెబ్బకు సక్సెస్ పోగొట్టుకున్న డైరెక్టర్ !

దాంతో తన మనసు నొచ్చుకుందని అనుపమ తెలిపింది. అందుకే కొన్నాళ్లు మలయాళ సినిమాలకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తమిళ్, తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టానని వివరించింది. ఈ క్రమంలో భాష రాకపోయినా తెలుగులో ‘అ ఆ’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశానని చెప్పింది. అప్పుడు చాలా మంది తెలియని దాంట్లో వేలు పెడుతున్నావని వెటకారం చేశారని, కానీ, చాలెంజింగ్‌‌‌‌గా తీసుకుని ఆ పాత్ర చేశానని ఆ తర్వాత తన కెరీర్ మలుపు తిరిగింది అని ఈ కేరళ కుట్టి చెప్పుకొచ్చింది. అఆ తర్వాత తెలుగులో అనుపమకు మంచి బ్రేక్‌ లభించింది. ఇప్పుడు తమిళ్‌, మలయాళంలో ఒక్కో మూవీ చేస్తున్న ఆమె.. తెలుగులో నిఖిల్‌ సిద్దార్థ్‌తో ఓ సినిమాకు ఓకే చెప్పింది.