Naga Vamsi Trollers: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగిన కూడా ఇకమీదట చేయబోయే సినిమాల కథల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి చాలా మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇలాంటి సందర్భంలోనే తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్న వాళ్లలో నాగవంశీ ఒకరు…ఈయన చేసిన సినిమాలు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. అయితే ప్రతి సినిమా ఈవెంట్ లో ఆయా సినిమాల మీద హైప్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాటి ద్వారా ఆయనను చాలామంది ట్రోల్ చేస్తూ వస్తున్నారు.
Also Read: 5వ రోజు భారీగా పడిపోయిన ‘కూలీ’ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కష్టం లాగానే ఉందే!
‘గుంటూరు కారం’ సినిమా సమయంలో ఆయన మాట్లాడిన మాటలను ప్రేక్షకులు ట్రోల్స్ గా మార్చి సోషల్ మీడియాలో అతన్ని ఒక ఆట ఆడుకున్నారు. ఇక మరోసారి వార్ 2 సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇక రీసెంట్ గా వార్ 2 సినిమా రిలీజ్ అయి ప్లాప్ టాక్ ను తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే…
ఇది బాలీవుడ్ సినిమా అయినప్పటికి ఎన్టీఆర్ ఉన్నాడనే ఉద్దేశ్యంతోనే నాగవంశీ ఈ సినిమాను భారీ రేంజ్ లో కొనుగోలు చేసి రిలీజ్ చేశాడు. అయినప్పటికి ఈ సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన నష్టాలను చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వరుసగా కింగ్డమ్, వార్ 2 సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్న ఆయన దాదాపు 100 కోట్ల వరకు నష్టాన్ని చవిచూసినట్టుగా తెలుస్తోంది.
మరి ఇలాంటి సందర్భంలోనే అతను మాట్లాడిన మాటలను సైతం జనాలు ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పెడుతున్నారు… మరి ఏది ఏమైనా కూడా నాగ వంశీ మాట్లాడే మాటలు ట్రోలర్స్ కి చాలా బాగా యూస్ అవుతున్నాయి అంటూ మరికొంతమంది సినిమా విమర్శకులు సైతం ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు…మరి నాగవంశీ రాబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకొని వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…