Coolie Collection Day 5: సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాల్లో ఒకటి ‘కూలీ'(Coolie Movie). లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) లాంటి డైరెక్టర్ తో రజినీకాంత్ చేతులు కలపడం, దానికి తోడు ఇండియా లో ఉన్న టాప్ స్టార్స్ అందరూ ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషించడం తో పాటు, విడుదలకు ముందు అనిరుద్ అందించిన పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యి ఈ సినిమా పై అలాంటి అంచనాలు ఏర్పాటు అవ్వడానికి కారణం అయ్యాయి. హద్దులు దాటిన అంచనాలు కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది. ఇది అభిమానులతో పాటు ట్రేడ్ కూడా ఊహించిందే. భారీ అంచనాలు ఉన్నప్పుడు ఒక సినిమాకు భీభత్సమైన పాజిటివ్ టాక్ రావడం ఈమధ్య కాలంలో జరగలేదు, కేవలం బాహుబలి 2 విషయం లో మాత్రమే ఇది జరిగింది.
Also Read: బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెలెక్షన్స్ కి ఎన్నివేల మంది కంటెస్టెంట్స్ పోటీ పడ్డారో తెలుసా..?
అయితే కూలీ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా, ఆన్లైన్ నెగిటివ్ రివ్యూస్ దండయాత్ర చేసినప్పటికీ కూడా ఆడియన్స్ ఈ చిత్రాన్ని గొప్ప ఆదరించారు. మొదటి నాలుగు రోజుల్లోనే 404 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ సినిమా. కేవలం తమిళ వెర్షన్ లో మాత్రమే కాదు, తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రం దుమ్ము లేపేసింది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లే దాదాపుగా 2 మిలియన్ డాలర్ల వరకు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ప్రభంజనం ఎలాంటిది అనేది. అయితే ఇంతటి భారీ వీకెండ్ తర్వాత, సినిమాకి ఎలాగో టాక్ లేదు కాబట్టి, కచ్చితంగా సోమవారం రోజున, అంటే 5వ రోజున ఈ సినిమా వసూళ్లు పూర్తిగా డౌన్ అవుతాయని అందరూ ఊహించారు. ఊహించినట్టు గానే డ్రాప్స్ అయితే భారీగానే పడ్డాయి కానీ, మరీ డిజాస్టర్ రేంజ్ లో అయితే పడిపోలేదు.
ఈ వారం మొత్తం మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది అనే నమ్మకం సోమవారం రోజున వచ్చిన వసూళ్లను చూస్తే కలుగుతుంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి సోమవారం రోజున 20 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అందులో తెలుగు వెర్షన్ నుండి 5 కోట్ల రూపాయిల గ్రాస్ ఉంటుందని అంచనా. ఓవరాల్ గా 5 రోజులకు కలిపి ఈ చిత్రానికి 430 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. హిందీ వెర్షన్ లో నిన్న ఒక్క రోజే బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 46 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్స్ కి కలిపి బుక్ మై షో యాప్ లో లక్ష 34 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా మొదటి సోమవారం రోజున ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 1 లక్షా 80 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. ఇది చాలా మంచి హోల్డ్ అనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ చిత్రం అన్ని వెర్షన్స్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 90 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.