Krishna River Flood Alert: అల్పపీడన ప్రభావంతో ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతో సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. అయితే ఈరోజు అల్పపీడనం వాయుగుండం గా మారి శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్రతో సహా కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది. అధికారులు గేట్లను ఎత్తారు. మరోవైపు నాగార్జునసాగర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల సాగర్ గేట్లను ఎత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రభావం ప్రకాశం బ్యారేజీ పై పడింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం ఉంది.
Also Read: కృష్ణా.. తీరని నీటి తృష్ణ.. సందిగ్ధంలో లక్షల ఎకరాల ఆయకట్టు భవితవ్యం
భారీగా ఇన్ ఫ్లో
ప్రకాశం బ్యారేజీకి భారీగా ఇన్ ఫ్లో ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు. వరద జలాలను యధావిధిగా కిందకు విడిచి పెడుతున్నారు. ఈరోజు తెల్లవారుజామునాటికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులుగా నమోదయింది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే కిందకు విడిచి పెడుతున్నారు. 15 గేట్లను రెండు అడుగుల మేర ఇద్దరు. మిగిలిన 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి వరద నీటిని వచ్చినట్టే కిందకు విడిచి పెడుతున్నారు. కాగా మ్యారేజి నీటిమట్టం 12 అడుగులు. అయితే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఒకేసారి విడిచిపెట్టడంతో.. నదిలో నీటి ప్రవాహం అమాంతం పెరిగింది. నదీ పరివాహక ప్రాంతాలు చిగురుటాకుల వణికి పోతున్నాయి. ముఖ్యంగా లంక గ్రామాలు ఆందోళనతో ఉన్నాయి.
Also Read: గోదావరి మహోగ్రం.. కృష్ణ దీనాతిదీనం
ప్రభుత్వం అప్రమత్తం..
కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. నది ప్రవహిస్తున్న అన్ని జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నదిలో ప్రయాణం చేయవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, ఘాట్ల వద్ద స్నానం చేయడం, చేపల పట్టడం వంటివి చేయకూడదని సూచనలు జారీ చేసింది. ఈ విషయంలో విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కీలక సూచనలు చేసింది. అయితే రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీ వద్దకు నీటి ప్రవాహం ఉండడంతో ఒకటో హెచ్చరికను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా నదికి సంబంధించి అన్ని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో.. నదిలో నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. విజయవాడ నగర ప్రజలు ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు.