Trivikram On Mahesh Babu: మాటల మాంత్రికుడు గా పేరు పొందిన త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఈయన ఇండస్ట్రీ కి ముందుగా రైటర్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డైరెక్టర్ గా మారీ మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తో గుంటూరు కరమనే ఒక సినిమా చేసి ప్రేక్షకుల చేత తిట్లు తింటున్నారు.
ఈ సినిమా సీరియల్ లా స్లోగా ఉందని అసలు దాంట్లో ఒక కథ లేదని చాలామంది రక రకాలుగా త్రివిక్రమ్ ను విమర్శిస్తున్నారు. ఇక మహేష్ బాబు అభిమానులైతే సోషల్ మీడియా లో త్రివిక్రమ్ ని విపరీతం గా ట్రోల్ చేస్తున్నారు. సినిమాకి ముందు మహేష్ బాబుకి ఈ సినిమాతో మనం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం అని నమ్మించి తీరా ఒక నాసిరకం సినిమా చేసి మోసం మహేష్ బాబు ని మోసం చేసిన డైరెక్టర్ గా త్రివిక్రమ్ ని అభివర్ణిస్తూ ఆయనతో ఒక ఆట ఆడుకుంటున్నారు.
త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఇంతకు ముందు చేసిన అతడు, ఖలేజా లాంటి సినిమాలు కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ ఈ సినిమా మాత్రం మరి దారుణంగా తీశాడని ఈ సినిమా చూసిన అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ కొడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇలాంటి ఒక డిజాస్టర్ ని చూడల్సి వస్తుందని ఎవరు ఊహించలేదు. ఈ సంక్రాంతి మహేష్ బాబు పండుగ అని అందరూ అనుకున్నారు.
కానీ మహేష్ బాబుకి హిట్ దక్కలేదు ఇక చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా మాత్రం తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తూ థియేటర్ల సంఖ్యను కూడా పెంచుకుంటుంది. ఇక దీనికంతటికి కారణం త్రివిక్రమ్ అనే చెప్పాలి ఆయన సరైన కథ రాసుకోకుండా ఏదో ఒక పాయింట్ తీసుకొని దానిమీద బోరింగ్ గా ఉండే సీన్లు రాసుకొని ఇష్టం వచ్చినట్టు గా తీయడం వల్ల త్రివిక్రమ్ మహేష్ బాబుని దారుణంగా మోసం చేశాడు అంటూ ఆయన మీద ఫన్నీ కామెంట్స్ ని యాడ్ చేస్తూ ఆయనని విపరీతమైన ట్రోలింగ్ అయితే చేస్తున్నారు.