Trivikram-Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. స్టార్ డైరెక్టర్ గా గొప్ప పేరు ను సంపాదించుకున్న త్రివిక్రమ్ (Truvikram) కెరియర్ మొదట్లో రైటర్ గా తన సత్తా ఏంటో చూపించి స్టార్ రైటర్ గా ఎదగడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించి పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి వరుస సినిమాలను చేస్తూ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో చేస్తున్న సినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది ఒక సీరియస్ మూడ్ లో నడిచే కథగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
Also Read : స్టార్ యాంకర్ శ్రీముఖి ఇలా అయిపోయిందేంటి? షాక్ లో ఫ్యాన్స్!
పాన్ ఇండియాలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వెంకటేష్ పాన్ ఇండియా హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం (Sankranthki Vastunnaam) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్ మరొక సక్సెస్ ని కూడా సాధించాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడట.
మరి త్రివిక్రమ్ సైతం గుంటూరు కారం సినిమా ప్లాప్ తో కొంచెం డీలా పడిపోయాడు. ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి తను అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ లను సాధిస్తూ గొప్ప ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక త్రివిక్రమ్ అయితే ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం ఆయనకు స్టార్ హీరోల నుంచి డేట్స్ అయితే వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో అతనికి గొప్ప గుర్తింపు రావాల్సి ఉంది. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ఆయనకి మళ్ళీ అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం అయితే వస్తుంది.
Also Read : ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ ఎన్టీఆర్ కి మరో సింహాద్రి అవుతుందా..?