Viral Video : ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ గా మారిన తర్వాత.. ఉపాధికి.. విద్యకు.. మనగడకు ఇంగ్లీష్ అనేది తప్పనిసరి అయిపోయింది. కాకపోతే ఇంగ్లీష్ అనేది ఒక బ్రహ్మ పదార్ధం లాంటిది. అర్థం అయినట్టే ఉంటుంది.. అదే సమయంలో అర్థం కానట్టు ఉంటుంది. అందువల్లే కొరుకుడు పడని భాషగా ఇంగ్లీష్ పేరుపొందింది. చదువు, ఉద్యోగం, ఉపాధి.. ఇలా అన్నింటికీ ఇంగ్లీష్ కావాల్సి రావడంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో నేర్చుకుంటున్నారు. కాకపోతే ఇంగ్లీషును మాత్రం పాశ్చాత్య దేశస్థుల స్థాయిలో మాట్లాడలేకపోతున్నారు. అందువల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు అప్పట్లో హ్యాపీడేస్ అని ఓ సినిమా వచ్చింది. అందులో పైడితల్లి అనే ఒక క్యారెక్టర్ ఇంగ్లీష్ ను సరిగ్గా మాట్లాడడు. ఇంటర్వ్యూ సమయంలో చాలా ఇబ్బంది పడుతుంటాడు. వాస్తవానికి ఆ సన్నివేశం నవ్వు తెప్పించినప్పటికీ.. ఇంగ్లీష్ రాకుంటే బాధ ఎలా ఉంటుందో ఆ పాత్ర ద్వారా శేఖర్ కమ్ముల నిరూపించాడు.
Also Read : కొండ రాళ్ల నుంచి మెహందీ.. టెక్నిక్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
పాత రోజులను గుర్తు చేశాడు
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువకుడు మాట్లాడిన ఇంగ్లీష్ భాష నవ్వులు పూయిస్తోంది. అతడు కావాలని అలా మాట్లాడాడా? లేక ఇంగ్లీష్ భాష రాక అలా మాట్లాడాడా? అనే విషయాలను పక్కన పెడితే.. ఇంగ్లీష్ భాష ఎంత కఠినంగా ఉంటుందో ఇతడి ఉదంతం కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. ఓ ఇంటర్వ్యూకు అతడు వెళ్లగా.. ఇంగ్లీషులో మాట్లాడేందుకు అతడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మహిళ.. పైగా ఆమె పాశ్చాత్య దేశానికి చెందిన మహిళ. ఆమె ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుతోంది.. పైగా ఇంటర్వ్యూకు సంబంధించి పిచ్చాపాటిగా ప్రశ్నలు అడగడంతో.. అతడు భయపడుతూనే దానికి సమాధానం చెప్పాడు. అయితే అందులోను బట్లర్ ఇంగ్లీష్ భాషను ఉపయోగించడంతో నవ్వులు పూయిస్తున్నాయి. “అతడు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అతడు ఇంగ్లీష్ అలా మాట్లాడుతుండడం నవ్వు తెప్పిస్తున్నప్పటికీ.. బహుశా అతడు గ్రామీణ పాఠశాలలో చదువుకున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ అక్కడిదాకా వెళ్ళాడు అంటే మామూలు విషయం కాదు. ఇంటర్వ్యూలో అతడు నెగ్గుతాడ? నెగ్గడా? అనే విషయాన్ని పక్కన పెడితే.. మొత్తానికి అతని ఆత్మ స్థైర్యానికి నమస్కారం పెట్టాల్సిందే.. ఇటువంటి వ్యక్తులు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తారు. చాలామందికి ఆదర్శంగా కనిపిస్తారు. కాకపోతే అతడు ఇంగ్లీష్ ఇంకా బాగా నేర్చుకుని ఉంటే బాగుండేదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు పట్టుదలతో ఏదైనా సాధిస్తారని.. అటువంటి వారికి అవకాశాలు ఇవ్వడం వల్ల కంపెనీ కూడా భారీగా లాభాలు కళ్ళ చూస్తుందని నెటిజన్లు అంటున్నారు.. ఇటువంటి వ్యక్తులు కష్టపడి పైకి వచ్చుంటారని.. అందువల్లే వారిలో సాధించాలి అనే తపన ప్రతి కోణంలోనూ కనిపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Old is gold pic.twitter.com/Q5gR0qmKWz
— Nirupama Kotekar (@nirupamakotekar) May 13, 2025