దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే ‘అల వైకుంఠపురములో’ అనే చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎవరితో వర్క్ చేయాలి అని కొన్నాళ్ళు ఆలోచించిన ఆయన చివరకు జూనియర్ ఎన్ఠీఆర్ ను ఫైనల్ చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ చేసిన ‘అరవింద సమేత’ మంచి విజయాన్ని అందుకోవడంతో వీరి కొత్త ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలు తెలుగు ప్రేక్షకుల వరకే పరిమితం కాబట్టి త్రివిక్రమ్‌కు ఇబ్బందేమీ లేదు.
Also Read: పవన్ సినిమా వెనుక గురూజీ హస్తం ఉందన్నమాట !
కానీ ఈ సినిమాకు ముందు తారక్ రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కనిపించనున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రం. అన్ని భాషల్లోనూ విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయిపోతారు. ఆయన మార్కెట్ స్థాయి, రెమ్యునరేషన్ అన్నీ పెరిగిపోతాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తాను చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలని ఎన్టీఆర్ భావిస్తారు. కాబట్టి త్రివిక్రమ్ తారక్ తో చేయబోయే సినిమా తప్పకుండా పాన్ ఇండియా మూవీనే అయ్యుండాలి.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’: హీరోలతో రాజమౌళికి కత్తిమీద సామేనా?
ఒకప్పుడు ‘అతడు, జల్సా, ఖలేజా’ లాంటి యాక్షన్ సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఈమధ్య మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్లే చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాకు కూడ మన తెలుగు ప్రేక్షకులకు సరిపోయేట్టు అలాంటి కథనే అనుకున్నారట. కానీ రాజమౌళి చేతి నుండి బయటికొచ్చే ఎన్టీఆర్ కొత్తగా ఇమేజ్ ను భుజాన వేసుకుని వస్తారు. అందుకే త్రివిక్రమ్ పాన్ ఇండియా స్టోరీతోనే ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంటుంది. సో.. ఆయన ఆల్రెడీ అనుకున్న పాత కథకే పాన్ ఇండియా రంగులు అద్దడమో లేకపోతే కొత్తగా పెద్ద స్పాన్ ఉన్న స్టోరీని రాసుకోవడమో చేయాలి.