https://oktelugu.com/

నాని, సాయి పల్లవి.. ఏం లేదు.. అంతా కూల్

తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి స్థాయికి ఎదిగిన నటుడు నాని. పెద్దగా బ్యాకప్ లేకపోయినా స్వయంకృషిని నమ్ముకుని పైకొచ్చిన హీరో. మొదటి నుండి వివాదాలకు చాలా దూరంగా అందరితోనూ స్నేహంగా ఉంటూ సౌమ్యుడనే పేరు తెచ్చుకున్నాడు. కానీ కొంత కాలం క్రితం ఆయన మీద లేనిపోని పుకార్లు పుట్టుకొచ్చాయి. కొందరి అత్యుత్సాహంతో నాని మీద విమర్శలు పడ్డాయి. 2017లో నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమా చేశారు. అందులో సాయి పల్లవి కథానాయికగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 26, 2020 / 10:51 AM IST
    Follow us on


    తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి స్థాయికి ఎదిగిన నటుడు నాని. పెద్దగా బ్యాకప్ లేకపోయినా స్వయంకృషిని నమ్ముకుని పైకొచ్చిన హీరో. మొదటి నుండి వివాదాలకు చాలా దూరంగా అందరితోనూ స్నేహంగా ఉంటూ సౌమ్యుడనే పేరు తెచ్చుకున్నాడు. కానీ కొంత కాలం క్రితం ఆయన మీద లేనిపోని పుకార్లు పుట్టుకొచ్చాయి. కొందరి అత్యుత్సాహంతో నాని మీద విమర్శలు పడ్డాయి. 2017లో నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమా చేశారు. అందులో సాయి పల్లవి కథానాయికగా చేసింది. సినిమా మంచి హిట్టైంది.

    Also Read: పవన్ సినిమా వెనుక గురూజీ హస్తం ఉందన్నమాట !

    కానీ సినిమా షూటింగ్ సమయంలో నానికి, సాయి పల్లవికి మధ్యన విబేధాలు ఏర్పడ్డాయని, అవి తారాస్థాయికి వెళ్లాయని, ఒకరంటే ఒకరికి అస్సలు పడటంలేదని, సాయి పల్లవి తీరుతో నాని బాగా హార్ట్ అయ్యారని ఏవేవో పుకార్లు పుట్టించారు. దీంతో అందరూ షాకయ్యారు. నాని ఏమిటి, వివాదాల్లోకి వెళ్లడమేమిటని ఆయన అభిమానులు ఫీలయ్యారు. అప్పట్లో నాని అవన్నీ ఒట్టి గాసిప్స్ మాత్రమే అంటూ కొట్టిపారేసిన ఆ వివాదం మాత్రం కొన్నాళ్లపాటు ప్రేక్షకుల చర్చల్లో నానింది.

    Also Read: మహేష్ ఫ్యామిలీ నుండి దూసుకొస్తున్న మరొక హీరో

    అయితే ఆ వివాదాలన్నీ నాని చెప్పినట్టు పుకార్లు మాత్రమేనని ఈరోజు ప్రూవ్ అయింది. ఎందుకంటే తన కొత్త చిత్రం ‘సాయి సింగ రాయ్’లో సాయి పల్లవి కథానాయకిగా నటిస్తున్నట్టు నాని ప్రకటించారు. ఒకవేళ సాయిపల్లవి, నానిల మధ్యన అంత పెద్ద గొడవలే ఉంటే ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేయరు కదా. సో.. ఆనాటి రూమర్లకు ఈనాడు పూర్తిస్థాయిలో చెక్ పడిందన్నమాట. ఇకపోతే ఈ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నాడు.