PM Narendra Modi: జోబైడెన్ తో మోడీ భేటి 24న.. ఏం జరుగనుంది?

PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే వారం రెండు రోజులు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు బైడెన్ తో సమావేశం కానున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. దేశ ఔన్నత్యాన్ని పెంచుకునే క్రమంలో ప్రధాని మోడీ విదేశాల పర్యటనలు ఉండడం గమనార్హం. మనదేశ విధానాలు తెలియజెప్పేలా మోడీ అమెరికాలో పర్యటించి మన ఉద్దేశాలను విశదీకరించనున్నారు. సెప్టెంబర్ 24న వాషింగ్టన్ లో మోడీ, బైడెన్, ఆస్రేలియా ప్రధాని […]

Written By: Srinivas, Updated On : September 14, 2021 6:58 pm
Follow us on


PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే వారం రెండు రోజులు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు బైడెన్ తో సమావేశం కానున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. దేశ ఔన్నత్యాన్ని పెంచుకునే క్రమంలో ప్రధాని మోడీ విదేశాల పర్యటనలు ఉండడం గమనార్హం. మనదేశ విధానాలు తెలియజెప్పేలా మోడీ అమెరికాలో పర్యటించి మన ఉద్దేశాలను విశదీకరించనున్నారు.

సెప్టెంబర్ 24న వాషింగ్టన్ లో మోడీ, బైడెన్, ఆస్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మధ్య క్వాడ్ సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 25న న్యూయార్క్ వేదికగా ఐక్య రాజ్య సమితి సమావేశం 76వ సెషన్ లో జరిగే జనరల్ డిబేట్ లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందులో మన దేశ పద్ధతులు తెలియజేయనున్నారు. క్వాడ్ దేశాలకు మన విధానాలు తెలిపేందుకు మోడీ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీ దాదాపు ఆరు నెలల తరువాత విదేశీ పర్యటన ఖరారు కావడంతో క్వాడ్ దేశాధినేతలతో ముఖాముఖి సమావేశంల పాల్గొననున్నారు. ఈ ఏడాది మార్చిలో క్వాడ్ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికి కరోనా కారణంగా నలుగురు నేతలు వర్చువల్ గా కలుసుకున్నారు. ఇందులో క్వాడ్ వ్యాక్సినేషన్ ఇనిషియేటివ్ కు శ్రీకారం చుట్టాయి. కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్లు మనదేశం కూడా ఎగుమతి చేసినా రెండో దశ ముప్పుు రావడంతో నిలిపివేసింది.

కొవిడ్ ప్రధాన ఎజెండాగా క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి పలు దేశాలకు చెందిన నేతలు హాజరవుుతున్నారు. సైబర్ నేరాలు, సముద్ర జలాల భద్రత, సహకారం, వాతావరణంలో మార్పులు విద్యా సాంకేతికతపై చర్చించనున్నారు. అఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ప్రభావంతో నెలకొనే ఉద్రిక్తతల మధ్య ఎదురయ్యే సవాళ్ల గురించి కడా చర్చించనున్నారు.

పసిఫిక్ మహా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. 2017 నవంబర్ లో ఇండియా, జపాన్, అమెరికా, ఆస్రేలియా కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడినట్లు తెలిసిందే. ఈ కూటమిని చైనా వ్యతిరేకిస్తోంది. తనకు కంటకంగా మారుతున్నాయని భావించిన చైనా ఈ కూటమి వద్దంటూ పలుమార్లు బుకాయిస్తోంది.