
Trivikram Srinivas: త్రివిక్రమ్ (Trivikram).. చాలా తెలివైన దర్శకుడు. పైగా బాగా లెక్కలు తెలిసిన దర్శకుడు. పెద్ద రచయితలే పది లక్షలు తీసుకుంటున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కోటి రూపాయిలు తీసుకున్న వ్యక్తి త్రివిక్రమ్. డబ్బు ఎలా సంపాదించాలో బాగా తెలిసిన సినిమా రచయితలలో త్రివిక్రమే తోపు. మొత్తానికి మొదటి సినిమా నుంచే డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టిన త్రివిక్రమ్.. ఇప్పుడు నిర్మాతగానూ సంపాదించడానికి రెడీ అయ్యాడు.
ఎలాగూ త్రివిక్రమ్ అంటే.. ఒక స్టార్ డైరెక్టర్ అనే బ్రాండ్ ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ ని పూర్తిగా వాడుకుంటూ తనకున్న టాలెంట్ తో ఇంకా బాగా సంపాదించాలనే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రమ్. అసలు ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకడు.
దానికి తోడు, మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాలకు రచయితగా పని చేసి సినిమాకి రెండు కోట్లు తీసుకుంటున్నాడు. పవన్ ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ తన రైటింగ్ సేవలకు మూడు కోట్లు తీసుకున్నాడు. పైగా త్రివిక్రమ్ కి థియేటర్ల బిజినెస్ కూడా ఉంది. భీమవరంలో త్రివిక్రమ్ కి రెండు థియేటర్స్ ఉన్నాయి.
అలాగే సితార సంస్థ నిర్మించే సినిమాల్లో త్రివిక్రమ్ అనధికార భాగస్వామి. ఇక అప్పుడప్పుడు స్టార్ హీరోలతో క్రేజీ యాడ్స్ తీస్తూ ఆ రకంగానూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాతగా మారాడు. పూర్తి నిర్మాతగా, తాజాగా తన భార్య పేరుతో ఒక నిర్మాణ సంస్థను మొదలుపెట్టాడు.
తన సినిమా నిర్మాణంలో మొదటి సినిమాని నవీన్ పోలిశెట్టితో చేస్తున్నాడు. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. మొత్తానికి త్రివిక్రమ్ విచ్చలవిడిగా సంపాదిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్స్ లోనే (రాజమౌళి మినహా) ఎక్కువ సంపాదిస్తోంది త్రివిక్రమే.