Whatsapp DP Check: మనం ఎక్కువగా ఉపయోగించే యాప్స్ లో వాట్సాప్ యాప్ ఒకటనే సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా వాట్సాప్ యూజర్ల సంఖ్య సైతం రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఇంటర్నెట్ ఉంటే సులభంగా వాట్సాప్ ద్వారా సందేశాలను పంపించడం సాధ్యమవుతుంది. వాట్సాప్ యాప్ ద్వారా సులభంగా ఆడియో ఫైల్స్ తో పాటు వీడియో ఫైల్స్ ను కూడా పంపడం సాధ్యమవుతుంది.
స్మార్ట్ ఫోన్ ను వినియోగించే వాళ్లలో దాదాపుగా అందరూ వాట్సాప్ యాప్ ను వినియోగిస్తారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలకు ఉన్న మంచి అప్లికేషన్లలో వాట్సాప్ యాప్ కూడా ఒకటని చెప్పవచ్చు. వాట్సాప్ యాప్ ను వినియోగించే వాళ్లు ఖచ్చితంగా డిస్ప్లే పిక్చర్ ను పెడతారనే విషయం తెలిసిందే. మనలో చాలామంది వాట్సాప్ డిస్ప్లేను ఎవరెవరు చూశారో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు.
అయితే వాట్సాప్ యాప్ లో డీపీని ఎవరు చూశారో తెలుసుకోవాలని అనుకుంటే ఒక యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్స్ ట్రాక్ లేదా who viewed my whatsapp profile యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని ఫోన్ లో ఇన్ స్టాల్ చేయడం ద్వారా వాట్సాప్ డీపీని ఎవరెవరు చూశారో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాట్సాప్ డీపీ చూసిన స్నేహితుల మొబైల్ నెంబర్లు , పేర్లను కూడా సులభంగా తెలుసుకోవచ్చు.
అయితే యాప్స్ సహాయంతో కేవలం గడిచిన 24 గంటల్లో చూసిన వాళ్ల వివరాలను మాత్రమే తెలుసుకోవడం సాధ్యమవుతుంది. వాట్సాప్ యూజర్లకు ఈ యాప్స్ వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.