The Raja Saab OTT: థియేటర్స్ లో ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు, ఓటీటీ లో రిలీజ్ అయ్యాక సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్నవి ఈమధ్య కాలంలో చాలానే చూశాము. అందుకు బెస్ట్ ఉదాహరణ ‘గుంటూరు కారం’. ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది, కానీ ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రానికి 21 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. టాలీవుడ్ నుండి నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ని రాబట్టిన టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిల్చింది ఈ చిత్రం. అదే విధంగా గత ఏడాది తమిళం లో విడుదలైన ధనుష్ ‘ఇడ్లీ కడై ‘ చిత్రం పరిస్థితి కూడా ఇంతే. థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్, కానీ నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రానికి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని అందరు ఊహించారు.
ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చింది. కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఈ సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదు, పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది అని అనేవారు. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందని అంచనా వేశారు. కానీ వాళ్ళ అంచనాలు తారుమారు అయ్యాయి. రీసెంట్ గానే ఈ సినిమా జియో హాట్ స్టార్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాని చూసిన నెటిజెన్స్ అందరూ, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో ఇలాంటి సినిమా తియ్యాలని ఎలా అనిపించింది అంటూ మారుతి ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని షాట్స్ ని ట్విట్టర్ లో అప్లోడ్ చేసి, మారుతీ ని ట్యాగ్ చేసి తప్పులను ఎత్తి చూపుతున్నారు.
సినిమాలో చాలా చోట్ల అసలు ప్రభాస్ లేడు, ఆయనకు బదులుగా డూప్స్ ని వాడారు, కనీసం ఆ డూప్స్ ని VFX ద్వారా కూడా కవర్ చేయలేకపోయాడు డైరెక్టర్ మారుతి. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. అదే విధంగా కొన్ని బ్లండర్ మిస్టేక్స్ ని కూడా ఎత్తి చూపించారు ప్రభాస్ ఫ్యాన్స్. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభాస్ కి గడ్డం ఉంటుంది, కానీ దిగేసరికి గడ్డం ఉండదు, అంతే కాకుండా ప్రభాస్ ఎక్కిన బస్సు కూడా మారిపోతుంది. ఒక పెద్ద సినిమా తీస్తున్నప్పుడు కనీస స్థాయిలో స్పృహ లేకుండా మారుతీ వ్యవహరించాడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. అంతే కాకుండా రాజమాత నుండి ఆస్తిని పొందిన తర్వాత కూడా సంజయ్ దత్ ఎందుకు పారిపోవాలని అనుకున్నాడు? వంటి ప్రశ్నలను కూడా సంధిస్తున్నారు ఫ్యాన్స్.
