https://oktelugu.com/

పవన్ సినిమా వెనుక గురూజీ హస్తం ఉందన్నమాట !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇద్దరి కలయికలో ‘జల్సా, అత్తారింటికి దారేది’ లాంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడ పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ మంచి ఆప్తులు. పవన్ సినిమాల సెలక్షన్ విషయంలో త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటూనే ఉంటుంది. పవన్ చాన్నాళ్ల క్రితమే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయాలనే డీల్ కుదుర్చుకున్నారు. Also Read: మహేష్ ఫ్యామిలీ నుండి దూసుకొస్తున్న […]

Written By: , Updated On : October 26, 2020 / 10:40 AM IST
Follow us on

Pawan Kalyan Movies
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇద్దరి కలయికలో ‘జల్సా, అత్తారింటికి దారేది’ లాంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడ పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ మంచి ఆప్తులు. పవన్ సినిమాల సెలక్షన్ విషయంలో త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటూనే ఉంటుంది. పవన్ చాన్నాళ్ల క్రితమే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయాలనే డీల్ కుదుర్చుకున్నారు.

Also Read: మహేష్ ఫ్యామిలీ నుండి దూసుకొస్తున్న మరొక హీరో

కానీ పలు కమిట్మెంట్స్ మూలంగా, సరైన కథ దొరక్క వారి ప్రాజెక్ట్ వాయిదాపడుతూనే వచ్చింది. ఇంతలో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ఆయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని సితార బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్ణయించుకున్నారు. అయితే ప్రధానమైన పాత్రల్లో ఎవరిని తీసుకోవాలనే తర్జనభర్జనలు పడుతున్న సమయంలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పేరు సజెస్ట్ చేశారట. ఏలాగూ తమ బ్యానర్లో పవన్ సినిమా చేయాల్సి ఉంది కాబట్టి గురూజీ సలహా మేరకు పవన్ పేరును ఫైనల్ చేసుకున్నారట వంశీ.

Also Read: బిగ్ బాస్-4: మాస్టర్ వెన్నుపొటుకు ‘దివి’ బలి?

పవన్ సైతం ఈ రీమేక్ చిత్రంలో నటించడానికి సుముఖత తెలపడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కేసింది. దర్శకుడిగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె చంద్ర ఫైనల్ అయ్యారు. ప్రజెంట్ పవన్ చేయబోయే పోలీస్ పాత్రలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. అందులో కూడ గురూజీ హస్తం ఉందని అంటున్నారు. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో టాలీవుడ్ హంక్ రానా నటించనున్నారు. ఈ సినిమా కోసం పవన్ రెండు నెలలు మాత్రమే డేట్స్ ఇచ్చారట. అందుకే ‘వకీల్ సాబ్’ ముగియగానే ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.