
ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ అభిషేక్ భరద్వాజ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అలాగే జిల్లాలో ఇటీవల తుపాకుల అమ్మకాలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాలకు చెందిన సమ్రాట్ దాలి, బంటీ చాట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. గతనెల 27న విశాఖజిల్లా అనకాపల్లిలో లోకానథం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఇంట్లో రెండు తుపాకులు, 18 రౌండ్లు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు పై విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే లోకనాథానికి ఢిల్లీకి చెందిన భరద్వాజ్ తుపాకులు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఇతడు బీహార్ నుండి తుపాకులు తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.