Trivikram Srinivas: సినిమా ఇండస్ట్రీలో గొప్ప దర్శకులు ఒక గొప్ప కథతో వచ్చిన ప్రతి సారి సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నారు. కొంతమంది దర్శకులకు మేకింగ్ విషయంలో కొంతవరకు తడబాటు ఉన్నప్పటికి కథలో క్లారిటీ ఉంటే సక్సెస్ ని సాధిస్తారనేది వాస్తవం. ఈ మధ్యకాలంలో చాలా మంది దర్శకులు దానిని ప్రూవ్ చేశారు. మొదటి నుంచి కూడా త్రివిక్రమ్ కథల విషయంలోనే కాకుండా తను రాసుకునే డైలాగుల విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటాడు. అందువల్లే ఆయన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. తద్వారా మేకింగ్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికి ప్రేక్షకులు అవేవీ పట్టించుకోకుండా సినిమాని సినిమాల చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. త్రివిక్రమ్ కి మాత్రమే అది సాధ్యమైంది. మిగతా దర్శకుల విషయంలో చాలా వరకు బెడిసి కొట్టింది. కొంతమంది మేకర్స్ స్క్రీన్ మీద సినిమాని అద్భుతంగా చూపించాలనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కథలో దమ్ము లేనప్పుడు నువ్వు ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా కూడా సినిమాలు సక్సెస్ సాధించదు.
మొత్తానికి ఇప్పుడు సైతం పాన్ ఇండియా బాట పడుతున్నాడు కాబట్టి మరోసారి డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. తన తోటి దర్శకులందరు డిఫరెంట్ వే లో ముందుకు సాగుతుంటే ఆయన కూడా తనకు నచ్చిన దారిలోనే ముందుకు వెళుతున్నాడు. అయితే కొంతమంది దర్శకులకు తను పోటీని ఇవ్వబోతున్నాడు అనేది వాస్తవం.
పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులకు తను పోటీగా మారబోతున్నాడు అంటూ అతని అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ కి ఉన్న నాలెడ్జ్ కి ఆయన ఒక మంచి కథను రాసుకొని దానిని స్క్రీన్ పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఆడుతుంది.
కానీ అతను కథల మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా ఇతర భాషల్లో సక్సెస్ అయిన కొన్ని కథలను తీసుకొని మన నేటివిటి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిన సినిమాలు చూస్తుంటాడు. అది అతనికి పెద్ద మైనస్ గా మారుతుంది. మరి ఇకమీదటైనా దానిని మార్చుకొని మంచి కథలను రెడీ చేసుకొని సినిమా చేస్తే త్రివిక్రమ్ ఇప్పటికీ టాప్ 5 డైరెక్టర్లలో ఒకడిగా నిలిచిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
