https://oktelugu.com/

Trivikram: పవన్ కళ్యాణ్ ధ్యాస లో పడి మహేష్ ని వదిలేసిన గురూజీ…

త్రివిక్రమ్ చెప్పిన సినిమాల్ని పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా రీమేక్ లు చేస్తూ సాక్స్ లు కొడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా స్టోరీలను మార్పులు చేర్పులు చేస్తూ వేరే డైరెక్టర్లతో డైరెక్షన్ చేయించి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి మంచి సక్సెస్ లు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 13, 2024 / 08:30 AM IST

    Trivikram

    Follow us on

    Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే త్రివిక్రమ్ అందులో డైలాగులు గాని లేదంటే స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. జల్సా తో మొదలైన వీళ్ళ అనుబంధం ఇప్పటివరకు కొనసాగుతూనే వస్తుంది.

    అయితే త్రివిక్రమ్ చెప్పిన సినిమాల్ని పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా రీమేక్ లు చేస్తూ సాక్స్ లు కొడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా స్టోరీలను మార్పులు చేర్పులు చేస్తూ వేరే డైరెక్టర్లతో డైరెక్షన్ చేయించి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి మంచి సక్సెస్ లు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ గుంటూరు కారం అనే సినిమాని అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గుంటూరు సినిమాకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మరి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేశాడు.

    ఇక ఎట్టకేలకు గుంటూరు కారం సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే రెండు సంవత్సరాల పాటు మహేష్ బాబు ను తన సినిమాకే పరిమితం చేసుకున్న త్రివిక్రమ్ ఇవాళ్ళ రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాని చూస్తే ఆయన పని తనం ఏంటో అర్ధం అయింది. ఇలాంటి సినిమా వల్ల ప్రేక్షకులు చాలా వరకు నిరాశ చెందారు.రెండు సంవత్సరాల కాలంలో మహేష్ బాబు తో చేయాల్సిన సినిమా ఇదా అంటూ ఆయన పైన మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియా వేదిక మరికొందరైతే పవన్ కళ్యాణ్ సినిమా మీద పెట్టిన ఫోకస్ ఈ సినిమా మీద పెట్టి ఉంటే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    నిజానికి గుంటూరు కారం సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ సంబంధించిన పనుల్లో త్రివిక్రమ్ బిజీ గా ఉండడం నిజంగా చాలా భాద ను కలిగించే విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తూ ఆ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరొక స్టార్ హీరో సినిమాకి వర్క్ చేయడం అనేది సరైన విషయం కాదు. మహేష్ బాబు కాబట్టి ఈ విషయం లో త్రివిక్రమ్ ను ఏమీ అనకుండా కామ్ గా ఉన్నాడు కానీ వేరే హీరో లు అయితే మాత్రం త్రివిక్రమ్ తో చాలా పెద్ద గొడవకి దిగేవారు. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా మహేష్ బాబు సినిమాను పట్టించుకోకుండా మహేష్ బాబు కి ఒక భారీ ప్లాప్ ఇచ్చాడు…