Allu Arjun : సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్లకే ఎక్కువ మార్కెట్ ఉంటుంది. వాళ్ళ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఆదరిస్తూ ఉంటారు…ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియాలో సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోలు అంతకు మించిన భారీ విజయాలను సాధించి ఇండస్ట్రీ హిట్లను నమోదు చేయడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు…అందుకే స్టార్ డైరెక్టర్లతో కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు… అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. నార్త్ లో ఆయన పేరు చెబితే చాలు పునకలతో ఊగిపోయే అభిమానులు ఉండటం విశేషం…త్రివిక్రమ్(Trivikram) లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకొని పాన్ ఇండియాలో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తనుకున్నట్టుగానే వరుస సినిమాలతో మంచి విజయాలను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.
ఇక ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయని త్రివిక్రమ్ ఈ సినిమా కోసం దాదాపు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ అంటే త్రివిక్రమ్ కు హోం బ్యానర్ లాంటిది.
అలాగే వాళ్ళ భార్య కూడా అందులో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలో ఆయన భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడం పట్ల కొంతమంది కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. తన వైఫ్ ప్రొడ్యూసర్ అయినప్పటికి తన వృత్తిరీత్యా తనకు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించాల్సిందే అంటూ త్రివిక్రమ్ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకే రెమ్యూనరేషన్ మాత్రం తను పక్కాగా తీసుకుంటారట. ఇక ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా?
త్రివిక్రమ్ ఒక భారీ వండర్స్ ని క్రియేట్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత వెయిట్ చేయాల్సిందే… అల్లు అర్జున్ ఇంతకు ముందు చేసిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేశాడని అందుకని ఇండస్ట్రీ రికార్డులను కూడా కొల్లగొట్టే విధంగా ముందుకు దూసుకెళ్లాడు. మరి ఈ సినిమాతో అంతటి విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…