Ram Gopal Varma , Chiranjeevi
Ram Gopal Varma and Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో హీరోలు ప్రేక్షకులను మెప్పించే సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది మాత్రం చేసిన సినిమాలన్నింటితో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వాళ్ళను వాళ్లు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు… ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు అయితే డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ యంగ్ డైరెక్టర్లతో కథ చర్చలు జరుపుతూ వాళ్లతో సినిమాలను చేసి వాళ్ళని స్టార్ డైరెక్టర్లను చేయడమే కాకుండా తను కూడా ఒక సూపర్ సక్సెస్ ని సాధించి మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం వాళ్ల సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ చేయడం కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు.అప్పట్లో వీళ్ళు చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకొని ఉండేది. ఇక బిళ్ళను అభిమానించే అభిమానుల సంఖ్య కొన్ని కోట్లల్లో ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక సంచలన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)…
కెరియర్ మొదట్లో చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. ఇక ఆ తర్వాత చేసిన సినిమాల్లో పెద్దగా మ్యాటర్ లేకపోవడం వల్ల ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను వర్మ ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటి ఎందుకు ఆయన వారిని విమర్శిస్తూ ఉంటాడు అనే అనుమానాలు అందరిలో కలుగుతూ ఉంటాయి.
గతంలో రామ్ గోపాల్ వర్మ చిరంజీవితో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. ఆ సినిమా ను మధ్యలోనే వదిలేసి బాలీవుడ్ హీరో తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి రామ్ గోపాల్ వర్మ మీద చాలా సీరియస్ అవ్వడమే కాకుండా ఆయనతో ఇక సినిమాలు చేసేది లేదని నిర్ణయించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా రామ్ గోపాల్ వర్మతో ఇప్పటివరకు ఒక్క సినిమా చేయలేదు.
వీళ్ళు తనను దూరం పెడుతూ రావడం వల్ల వర్మ వాళ్లను విమర్శిస్తూ వస్తున్నాడని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మెగాస్టార్ లాంటి స్టార్ హీరో డేట్స్ ఇచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టి మరో హీరోతో సినిమా చేయడం అనేది వర్మ చేసిన తప్పు అని మరి కొంతమంది వర్మ గురించి నెగిటివ్ గా చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఎప్పుడూ మెగా ఫ్యామిలీని విమర్శిస్తూనే ఉంటాడు. ఇక దాన్ని ఎవరూ పట్టించుకోకపోయినా కూడా పదేపదే నొక్కుతూ వాళ్ల మీద ట్వీట్లు చేస్తూ ఉంటాడు. ఇలాంటివి చేయడం వల్ల మెగా అభిమానులు కోపానికి గురై వర్మ మీద తీవ్రమైన కామెంట్లైతే చేస్తూ ఉంటారు…