Trivikram Srinivas: త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడలేదు కానీ టీవీల్లో మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇక ఇప్పటికే కూడా ఈ సినిమాలను టివీ ల్లో వస్తే మిస్ అవ్వకుండా చూసే జనాలు కూడా ఉన్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాని థియేటర్ లో సూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతో మంచి కథని రాసుకొని అందులో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చాలా హనేస్ట్ గా తెరకెక్కించి ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ని చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మహేష్ బాబు అభిమానులతో పాటుగా సామాన్య జనాలు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. జనవరి 12వ తేదీన బాక్సాఫీస్ ని కలక్షన్ల సునామితో ఊచకోత కోయడానికి రెఢీ అవుతున్నట్టు గా తెలుస్తుంది… ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్ తన గత సినిమా అయిన అలా వైకుంఠపురంలో సినిమాలో ఎలాంటి క్లైమాక్స్ అయితే వాడాడో ఇక్కడ కూడా అదే రిపీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో క్లైమాక్స్ లో ఫైట్ ఉన్నప్పటికీ ఒక ఎమోషన్ డ్రామాని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి ఒక సిచువేషన్ ని అత్తారింటికి దారేది సినిమా నుంచి క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. వరుసగా అప్పటి నుంచి వచ్చిన ప్రతి సినిమాలో కూడా క్లైమాక్స్ లో ఫైట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఎమోషనల్ సిచువేశన్ కి కన్ క్లూజన్ ఇచ్చి సినిమాని ఎండ్ చేస్తూ ఉంటాడు. అదే పాటర్న్ ని ఈ సినిమాలో కూడా వాడినట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ కొందరు అంటుంటే మరికొందరు మాత్రం రోటిన్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా మెజార్టీ ఆఫ్ మెంబర్స్ కి అయితే ఈ ట్రైలర్ బాగా నచ్చింది కాబట్టి ఈ సినిమా మీద అంచనాలను కూడా పెంచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరిస్తుంది అనేది కూడా ఇక్కడ పెద్ద చర్చగా మారింది. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు కానీ ఒకవేళ డివైడ్ టాక్ వచ్చి మిగతా సంక్రాంతి సినిమాల్లో ఏ ఒక్క దానికైన పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ఆ సినిమాకి కలక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దాంతో పాటుగా గుంటూరు కారం సినిమాకి కలక్షన్స్ భారీ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి…చూడాలి మరి ఈ సంక్రాంతి కి ఏ సినిమా విజయం సాధిస్తుందో…