Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఈరోజు రిలీజ్ అయింది.అయితే ఈ సినిమాకి వస్తున్న ఆదరణ భారీ స్థాయిలో ఉండటంతో ఈ సినిమా మీద అంచనాలు ఒకేసారి తార స్థాయికి వెళ్లిపోయాయి. అయితే ఈ సినిమా తన సత్తా చూపించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనేది పక్కాగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంతకు ముందు ఉన్న రికార్డ్ లన్ని బ్రేక్ చేస్తూ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ మారనున్నట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ అంటే కమర్షియల్ సినిమాలను చాలా ఈజీగా డీల్ చేసే డైరెక్టర్ కానీ మొదటిసారిగా ఉరమాస్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ని చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ ని చాలా సాఫ్ట్ గా చూపిస్తూనే వైలెంట్ గా కూడా చూపించాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఉర మాస్ ఊచకోతే అన్నట్టుగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు ఈ సినిమా మీద చాలామంది చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేశారు అందరికీ ఈ గ్లింప్స్ సమాధానం చెప్పిందని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదిక వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ సినిమా మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీయార్లు ఉన్నారు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు గ్లింప్స్ లో వచ్చిన ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎన్టీఆరా లేదంటే నార్మల్ టైం లో ఉన్న ఎన్టీఆర్ అనే విషయం మీద ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తూనే ఒక సంచలనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో చేసిన అదుర్స్,అలాగే ట్రిపుల్ రోల్ లో చేసిన జై లవకుశ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మరి ఇప్పుడు కూడా డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఇమాజినేషన్ కి దర్శకుడు గ్లింప్స్ తో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక దానిమీద మనం ఎలాంటి ఊహాలైతే పెట్టుకున్నామో ఆ అంచనాలకు మించి ఈ గ్లింప్స్ ఉందనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ డ్యూయల్ రోల్ లో చేసిన శక్తి, ఆంధ్రావాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ ఆ సినిమాల్లో ఇద్దరు ఎన్టీయార్లు కలిసి స్క్రీన్ మీద ఒకేసారి కనబడరు, కానీ అదుర్స్, జై లవకుశ లో మాత్రం ఒకేసారి ఇద్దరు ఎన్టీయార్లు కనిపిస్తారు. ఇక దేవర లో కూడా ఇద్దరు ఎన్టీయార్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారనే టాక్ అయితే వినిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా అదుర్స్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ సూపర్ సక్సెస్ సాధిస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది…