Sirivennela: “పదాలనే కిరణాలు తీసుకుని.. అక్షరాలనే తూటాలతో వేటకు వెళ్తాడు”

Sirivennela: సిరివెన్నెల రాసే పాటల్లో ఎంత లోతు దాగింటుందో.. ఆయన జీవితంలో కూడా అంతే లోతైన భావాలు పెనవేసుకుని ఉంటాయి. అసలు ఆయన గొప్పతం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. పదాలు కూడా సరిపోవు. అచ్చం ఇవే మాటలు ఓ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ  భావోద్వేగంతో చెప్పారు. ఆ మాటలను మళ్లీ ఇప్పుడు ఓసారి గుర్తు చేసుకుందాం. ‘సీతారామశాస్త్రి గారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు.. నాకున్న పదాలు సరిపోవు.. ఎందుకంటే […]

Written By: Sekhar Katiki, Updated On : December 1, 2021 3:35 pm
Follow us on

Sirivennela: సిరివెన్నెల రాసే పాటల్లో ఎంత లోతు దాగింటుందో.. ఆయన జీవితంలో కూడా అంతే లోతైన భావాలు పెనవేసుకుని ఉంటాయి. అసలు ఆయన గొప్పతం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. పదాలు కూడా సరిపోవు. అచ్చం ఇవే మాటలు ఓ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ  భావోద్వేగంతో చెప్పారు. ఆ మాటలను మళ్లీ ఇప్పుడు ఓసారి గుర్తు చేసుకుందాం.

‘సీతారామశాస్త్రి గారి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు.. నాకున్న పదాలు సరిపోవు.. ఎందుకంటే ఆయన మొదటి సినిమా  సిరివెన్నెలలో రాసిన మొదటి పాట…ప్రాగ్దిశ వీణియ పైన…దినకర మయూఖ తంత్రుల పైన.. ఆ పాట విన్న వెంటనే నేను తెలుగు డిక్షనరీ ఒకటి ఉంటుందని కనుక్కున్నా. దానిని శబ్దరత్నాకరం అంటారని తెలుసుకున్నా. అది వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని ప్రాగ్దిశ అంటే ఏమిటి.. మయూఖం అంటే ఏంటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నా. అంటే ఒక పాటని అర్థమయ్యేలాగే రాయనక్కర్లేదు.. దాన్ని అర్థం చేసుకోవాలి అనే కోరికను పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచినటువంటి వ్యక్తి సిరివెన్నెల. అని చెప్పుకొచ్చారు.

నాకు తెలిసి ప్రపంచం అంతా పడుకున్న తరువాత ఆయన లేస్తాడు. అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఆయన. పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలతో ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరుతాడు… రాత్రి పూట. ‘రండి… నాకు సమాధానం చెప్పండి…’ అని. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలని మన మీదకి సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు.. మన హాలులో కూర్చుంటాడు.. మన బెడ్రూమ్‌లో మన పక్కనే నిలబడతాడు.. మనల్ని క్వశ్చన్‌ చేస్తాడు. “రా.. ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి” అంటాడు.

అప్పట్లో ఈ మాటలు ఓ సెన్​సేషన్​ అయ్యాయి. ఓ రచయిత గురించి ఇంత డెప్త్​గా అనర్గలంగా చెప్పి.. రచయిత గొప్పతనాన్ని గుర్తు చేశారు త్రివిక్రమ్​.