https://oktelugu.com/

Actress Poorna: పూర్ణ నటించిన “బ్యాక్ డోర్” చిత్ర రిలీజ్ వాయిదా… కారణం ఏంటంటే ?

Actress Poorna: అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయ్యింది నటి పూర్ణ. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ సినిమాలతో మరింత పాపులర్ అయ్యింది. ఇప్పుడు తాజాగా పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బ్యాక్ డోర్’. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో తేజ త్రిపురాన హీరో గా చేయగా… ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయాలని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 / 03:14 PM IST
    Follow us on

    Actress Poorna: అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయ్యింది నటి పూర్ణ. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ సినిమాలతో మరింత పాపులర్ అయ్యింది. ఇప్పుడు తాజాగా పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బ్యాక్ డోర్’. కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో తేజ త్రిపురాన హీరో గా చేయగా… ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనుకున్న సంఖ్యలో థియేటర్లు లభ్యం కానందున సినిమాను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించారు.

    ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకు తగ్గ సంఖ్యలో థియేటర్లు లభించలేదు. అందుకని చిత్రాన్ని వాయిదా వేశాం అని చెప్పారు. ఈ నెల 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా వాయిదా పడినా మరో సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నటి పూర్ణ.

    డిసెంబర్ 2న బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా విడుదల అవుతుంది. బాలయ్య – బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో నందమూరి అభిమానుల్లో ఈ చిత్రంపై భారీగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా కావడంతో తారస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీలో పూర్ణ ఒక ముఖ్య పాత్రలో నటించారు. అలానే 3వ తేదీన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘మరక్కార్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండగా… రిలీజ్ కి ముందే జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అందువల్ల చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం కష్టమవుతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.