Pawan Anti Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ముమ్మరంగా ఓ చర్చ మొదలుపెట్టారు. ఇంతకీ ఏమిటి ఆ చర్చ అంటే.. పవన్ ఓ సందర్భంలో తాను రెండు లక్షల పుస్తకాలు చదివాను అని ఎప్పుడో ఎక్కడో అన్నారట. అన్నట్లు సాక్ష్యాలు లేవు. కానీ పవన్ ఇలాంటి వ్యాఖ్యలే ఏవో అన్నట్టు గుర్తులున్నాయి లేండి. కాబట్టి.. పవన్ పబ్లిసిటీ కోసమో.. లేక తాను గొప్ప జ్ఞాన వంతుడిని అని అనిపించుకోవడానికో చెప్పి ఉంటాడని అనుకోలేం.

పవన్ కి ఉన్న స్టార్ డమ్ రీత్యా కొత్తగా పవన్ కి ఏమి అక్కర్లేదు. కావున, పవన్ మాటలను తప్పుగా అర్ధం చేసుకోలేం. కానీ యాంటీ ఫ్యాన్స్ అంటేనే విమర్శల అస్త్రాలు. కాబట్టి.. పవన్ మాటల్లో నిజమెంత ? అనే కోణంలో చర్చ పెట్టారు. అసలు ఒక పుస్తకాన్ని ఏకబిగిన చదివినా కనీసం పది రోజులు పడుతుందనేది సగటు రీడర్ అభిప్రాయం.
ఇలా కాక, నిత్యం పుస్తకాలు చదివే వ్యక్తులు బిల్ గేట్స్ కానీ, మార్క్ జూకర్బర్గ్ కానీ వారానికి ఒక పుస్తకం మాత్రమే చదువుతారని వారే చెప్పారు. ఆ లెక్కన ఏడాదికి యాభై రెండు పుస్తకాలు మాత్రమే. ఈ లెక్కనే ఒక ప్రమాణం కింద తీసుకుంటే పవన్ కళ్యాణ్ లక్షల పుస్తకాలు కాదు కదా, వేల పుస్తకాలు చదవడం కూడా దాదాపు అసాధ్యం.
Also Read: భీమ్లానాయక్ సాంగ్ రిలీజ్ వాయిదా.. ఆయన మరణించడమే కారణమా?
పోనీ మన పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి… రెండు రోజులకు ఒక పుస్తకం చదివేసాడు అనుకుందాం. రెండు రోజులుకొక పుస్తకం చదివినా వేల పుస్తకాలు చదవడం కుదరదు. మరి పవన్ మాటలు నిజమే అనుకుంటే.. రోజుకు ఎనిమిది పుస్తకాలు చదివితే తప్ప పవన్ వేల పుస్తకాలను పూర్తి చేయలేడు.
మరి ఈ లెక్కతో పవన్ మాటలో నిజం ఏమిటో తెలిసింది కదా’ అంటూ మొత్తానికి పవన్ యాంటీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. చేస్తే చేశారు, పవన్ పై విమర్శలు అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. తిక్కకు లెక్క లేని మన పీకే బాబు, ఇంతకీ వేల బుక్స్ చదివి ఇంటర్ ఎలా ఫెయిల్ అయ్యాడు ? అంటూ ఎగతాళి చేస్తున్నారు.
Also Read: ఇక సర్దుకో పవన్… నీ టైం బాగోలేదు !