Pawan Kalyan Trisha : పవన్ కళ్యాణ్ పక్కన నటించడం ఏ హీరోయిన్ కి అయినా ఒక వరం లాంటిది..ఆయనతో చేసే సినిమా సూపర్ హిట్ అయితే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ వస్తుంది..గతం లో ఎంతోమంది హీరోయిన్స్ విషయంలో ఇది నిజం అయ్యింది..సౌత్ ఇండియా లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ సైతం పవన్ కళ్యాణ్ తో ఒక నటించడానికి పోటీ పడుతారు..గతం లో సౌత్ ఇండియాలో నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష కూడా ఇలాంటి కామెంట్స్ చేసింది.

పవన్ కళ్యాణ్ పక్కన నటించడం అదృష్టం గా భావిస్తాను అని చెప్పుకొచ్చింది..’బంగారం’ సినిమాలో 5 నిమిషాల అతిథి పాత్ర పోషించిన త్రిష, ‘తీన్ మార్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది..ఆ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు..అయితే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిందంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో త్వరలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా తెరకెక్కబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే..కొద్దీ రోజుల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా మార్చి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం త్రిష ని సంప్రదించాడట డైరెక్టర్ హరీష్ శంకర్..కానీ ప్రస్తుతం ఆమె ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 లో హీరోయిన్ గా నటిస్తుండడం తో డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి నో చెప్పినట్టు తెలుస్తుంది.
ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యి త్రిష పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడేలా చేసింది..త్రిష ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్ హీరోయిన్ అని..ఆమెతో సౌత్ లో ఉన్న స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని..అలాంటి సమయం లో ఆమెకి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చెయ్యడం ఏమాత్రం బాగోలేదు అంటూ పవన్ ఫ్యాన్స్ త్రిష పై ఫైర్ అవుతున్నారు.