Trisha Krishnan : కుర్రాళ్ళ కలల రాకుమారిగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న త్రిష ఆమె చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు కూడా మరొక ఎత్తుగా మారబోతున్నాయి. అల్లుడు ఎలా ఉందో ఇప్పటికి అలానే ఉంది. డైట్ మెయింటైన్ చేస్తూ తన అందాన్ని కాపాడుకుంటూ తన నటనతో ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకునేల చేస్తుంది. మరి తను 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగడానికి మహేష్ బాబు, ఇళయ దళపతి విజయ్ కూడా కారణం అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి నటుడు అప్పటివరకు ఏ హీరోయిన్ ని కూడా రెండుసార్లు తన సినిమాలో రిపీటెడ్ గా హీరోయిన్ గా అవకాశాలైతే ఇవ్వలేదు. త్రిషకి మాత్రం అతడు, సైనికుడు సినిమాల్లో రెండుసార్లు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. అయితే వీరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికి దాన్ని వీళ్లిద్దరు లైట్ తీసుకున్నారు. ఇక దళపతి విజయ్ త్రిష కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి.
Also Read : నా జీవితంలోనే అత్యంత కష్టమైన సినిమా వర్షం.. ప్రభాస్ తో చేయడంపై బాంబు పేల్చిన త్రిష
వీళ్ళ మధ్య కూడా ఏదో ఎఫైర్ అయితే ఉందంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పక్కన పెడితే త్రిష ఇండస్ట్రీ లో ఇన్ని సంవత్సరాలు సర్వేవల్ అవ్వడానికి విజయ్ చాలా వరకు హెల్ప్ చేస్తున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. త్రిష సైతం ఎప్పటికప్పుడు విజమ్ మీద కృతజ్ఞత భావాన్ని చాటుతూ ఉంటుంది.
ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాల అయినప్పటికి త్రిష మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటూ మంచి క్యారెక్టర్ లను చేస్తూ ముందుకు సాగుతుంది. హీరోయిన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లను చేస్తూ సీనియర్ హీరోల్లో నటిస్తూ చాలా బిజీగా కొనసాగుతుంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో త్రిష లాంటి హీరోయిన్స్ సైతం భారీ విజయాన్ని సాధించి ఇండస్ట్రీలో కొనసాగాలని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్నాడు…
తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లు ఫేడౌట్ అయిపోయిన తనకంటే తర్వాత వచ్చిన హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన తను మాత్రం ఇక్కడే ఉండటం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఎంత టాలెంట్ ఉన్న కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ బోర్ కొట్టించకుండా ముందుకు సాగడం అంటే అంత మాషి వ్యవహారం అయితే కాదు కానీ ఆమె ఆ విషయంలో సైతం సక్సెస్ అయిందనే చెప్పాలి…
Also Read : త్రిష పరాన్నజీవి, విజయ్ జీవితంలోకి ప్రవేశించింది? స్టార్ సింగర్ సెన్సేషనల్ కామెంట్స్!