Trisha Golden Hand: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో విజయ్ పేరు మీడియా, సోషల్ మీడియా లో ఎలా అయితే వినిపిస్తుందో, ఆయనతో పాటు హీరోయిన్ త్రిష పేరు కూడా అలాగే వినిపిస్తోంది. ఎందుకంటే వీళ్లిద్దరు చాలా కాలం నుండి సహజీవనం చేస్తున్నారు కాబట్టి, అదే సమయంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి గా నేడు ప్రమాణస్వీకారం చేసాడు కాబట్టి. నేటి కార్యక్రమానికి త్రిష చక్కగా చీర కట్టుకొని రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే త్రిష విజయ్ జీవితం లోకి వచ్చినప్పటి నుండి, ఆయనకు అన్నీ విజయాలే దక్కుతున్నాయని , విజయ్ కెరీర్ కి త్రిష ఒక గోల్డెన్ లక్ లాగా తయారైందని , ఆయనకు టీవీకే పార్టీ ని పెట్టే ఆలోచన కూడా త్రిష నే ఇచ్చిందని , ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి.
ఇదంతా పక్కన పెడితే త్రిష గోల్డెన్ లక్ కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి, తమిళ హీరో సూర్య లకు కూడా కలిసొస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే త్రిష మెగాస్టార్ చిరంజీవి తో ‘విశ్వంభర’ అనే చిత్రం చేసింది , అదే విధంగా సూర్య తో ‘కరప్పు’ అనే చిత్రం చేసింది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుండగా , ‘కరప్పు’ చిత్రం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు లో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే పేరు తో విడుదల కాబోతుంది. తమిళనాడు ఎన్నికల కారణంగా త్రిష కి వచ్చిన ఫ్రెష్ క్రేజ్ తో ఈ సినిమా విడుదల అవ్వబోతుండడంతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు విశ్లేషకులు. అదే విధంగా త్రిష గోల్డెన్ లక్ ఫ్యాక్టర్ కూడా కలిసొస్తుందని అంటున్నారు.
చాలా కాలం నుండి సూర్య సరైన హిట్ లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ త్రిష ఫ్యాక్టర్ ఆయనకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఇక త్రిష హీరోయిన్ గా నటించిన మరో చిత్రం ‘విశ్వంభర’ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకొని, సినిమాని పూర్తి చేసుకున్నప్పటికీ కూడా , గ్రాఫిక్స్ క్వాలిటీ కారణంగా ఇన్ని రోజులు ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. దీంతో అసలు ఈ సినిమా ఉందనే విషయాన్నే మర్చిపోయారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రానికి బజ్ రావాలంటే కచ్చితంగా త్రిష ఫ్యాక్టర్ కలిసి వస్తుందని అంటున్నారు. మరి అభిమానుల నమ్మకాలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.