మాజీ బ్యూటీ త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పైగా చాల రకాలుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా త్రిష ఓ తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందనే వార్త బాగా వినిపించింది. ఓ దశలో ఈ న్యూస్ నిజమే అనుకున్నారు. అయితే ఈ వార్త పై తాజాగా త్రిష క్లారిటీ ఇచ్చింది.
త్రిష మాటల్లోనే.. ‘నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇక కోలీవుడ్ కు చెందిన ఓ దర్శకుడితో ప్రేమలో మునిగిపోయానని.. పైగా పెద్దల అంగీకారంతో అతన్ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని.. ఇలా అనేక వరుస కథనాలు నా పై సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే.
ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే ఉంది. నాకు సినిమా ఇండస్ట్రీలో ఇంకా కెరీర్ ఉంది. నాకు అవకాశాలు రావట్లేదు అని కూడా రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. నాకు ఇప్పటికీ ఛాన్స్ లు వస్తున్నాయి. నేనే బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. ఇక నా పెళ్లి పై పుకార్లు ఆపేయండి. ఒకవేళ నేను వివాహబంధం లోకి అడుగు పెట్టాలనుకుంటే అందరికీ చెబుతాను.
అయినా నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. తప్పకుండా అధికారికంగా ప్రకటిస్తాను. చాటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు ఏముంది’ అంటూ చెప్పుకుంటూ పోయింది త్రిష. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికి హీరోయిన్ అయ్యి ఉండేది ఏమో. ఏజ్ అయిపోతున్నా త్రిష మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు.