Trisha: మాజీ బ్యూటీ త్రిష సినిమాలకు గ్యాప్ ఇస్తే, చివరికి ఆ గ్యాపే కెరీర్ ఎండ్ కి రీజన్ అయిపోయింది. ఎలాగూ వయసు కూడా 38 దాటేస్తుంది. నిజానికి ఐదేళ్ల క్రితమే త్రిష పెళ్లి ఆలోచన చేసింది. కానీ కాలం కలిసి రాక, పెళ్లి కాలేదు. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికి చైల్డ్ ఆర్టిస్ట్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఉండేది.

కానీ ఏమి చేస్తాం, ఇంకా త్రిషకి పెళ్లి కాకపాయే. ఒకపక్క త్రిష పెళ్లి అంటూ, మరోపక్క త్రిష సైడ్ బిజినెస్ అంటూ ఆమె పై పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా పెళ్లి విషయం పై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు త్రిష సమాధానం చెబుతూ ‘పెళ్లి ఆలోచన ఉంది, కానీ వరుడు దొరకాలి కదా’ అంటూ కాస్త నీరసంగా చెప్పుకొచ్చింది.
Also Read: Rajamouli: ఎంతో టాలెంట్ ఉన్న రాజమౌళి సీరియల్ డైరెక్ట్ చేయడానికి కారణమేంటో తెలుసా?
అయితే, గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో త్రిష పెళ్లి పై అనేక రూమర్స్ వినిపించాయి. ఓ సందర్భంలో పెళ్లి అయిపోయిందని, ఆమె గర్భవతి కూడా అని ఓ వార్త తెగ వైరల్ అయింది ఆ మధ్య. తన బాయ్ ఫ్రెండ్ ను త్రిష రహస్య వివాహం చేసుకుందని.. దాని ఫలితంగా ఆమె గర్భం కూడా దాల్చింది అని, అందుకే మధ్యలో త్రిష సంవత్సరం పాటు ఎవరికీ అందుబాటులో లేదనే వార్త బలంగా వినిపించింది.
కానీ ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ తో గొడవలు కారణంగా అతనితో త్రిష విడిపోయింది. అయితే, త్రిష మాత్రం తనకు అప్పుడు గర్భం రాలేదు అంటుంది. ఇక కొంత కాలంగా సినిమాల్లో మళ్ళీ బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక తన లైఫ్ స్టైల్ పై, తన వ్యవహారాల తంతంగం పై గాసిప్ రాయుళ్లు ఎంత తాపత్రయ పడినా త్రిష మాత్రం ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు.
ఏది ఏమైనా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష అంటే.. ఇప్పటికీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. నిజానికి కొన్ని నెలల క్రితమే త్రిష ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంది. కాకపోతే సినిమాకి సైన్ చేసిన తర్వాత, ఆ సినిమా నుంచి ఆమెను తప్పించారు. వాస్తవానికి ఆ సినిమా నుంచి ఆమెను దూరం పెట్టడానికి కారణం.. త్రిష అడిగిన అదనపు రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.
Also Read: Ram Charan: ఎన్టీఆరే కాదు, చిరంజీవి అయినా తగ్గేదెలే అంటున్న చరణ్ !
[…] SS Rajamouli: సినీ సెలబ్రిటీలు ఎక్కడకు వెళ్లినా.. వారికి ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వారితో ఒక్క సెల్ఫీ తీసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే ఇలా సడెన్ గా రోడ్లపై సామన్యుడిలా తిరిగే వారు చాలామంది ఉంటారు. ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తోంది. ఈ రంజాన్ వేళలో చార్మినార్‌ను చూస్తే ఆ కిక్ వేరే లెవల్ అనే చెప్పుకోవాలి. ఆ మజాను దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఎంజాయ్ చేయాలనుకున్నారేమో. […]