HomeతెలంగాణBugga Water Falls : వీడియో: ‘బుగ్గ’ జలపాత అందాలను బంధించిన ‘ఓకే తెలుగు’.. చూడతరమా?

Bugga Water Falls : వీడియో: ‘బుగ్గ’ జలపాత అందాలను బంధించిన ‘ఓకే తెలుగు’.. చూడతరమా?

Bugga Water Falls : చినుకు చినుకు కలిస్తే వరద.. కొండ నుంచి జాలువారితే అది జలపాతం.. తెలంగాణలో అద్భుతమైన జలపాతాలు అందాలొలికిస్తున్నాయి. కాలాలు ఏవైనా అవి పారుతూనే ఉంటాయి. ఎండాకాలం కావడంతో వాటి తీవ్రత తగ్గినా పాయలుగా పారుతూనే ఉంటాయి. వానాకాలం ఉగ్రరూపంతో పోటెత్తుతాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న కొండకోనల్లో సహజమైన జలపాతాలు ఉన్నాయి. వాటిని చేరుకోవడం కష్టమైనా అక్కడి అందాలు, ప్రకృతి రమణీయత మాత్రం స్వచ్ఛంగా ఇప్పటికీ ఉన్నాయి.. అలాంటి మారుమూలన ప్రజలు ఎవరూ వెళ్లలేని జలపాతమే ‘బుగ్గ’. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం ‘రాచకొండగుట్ట’ల్లో పలు జలపాతాలు ఉన్నాయి. వాటిలో బుగ్గ జలపాతం ఒకటి. మర్రిగూడ మండలం అజాలపురం సమీపంలోని ఈ జలపాతం సందర్శకుల మనసు దోచుకుంటోంది. వర్షాకాలంలో 2 నుంచి మూడు నెలల పాటు ఇది తీవ్రంగా జాలువారుతుంది. ఈ ఎండాకాలం చిన్న పాయలుగా నీళ్లు రాలుస్తోంది.

అయితే బుగ్గ జలపాతానికి చేరుకోవడానికి సరైన రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ ప్రకృతి సంపదను ఎవరూ చూడలేకపోతున్నారు. సందర్శకులు అక్కడికి చేరుకోలేకపోతున్నారు. దాంతో ఈ జలపాతం గురించి బయట జనాలకు ఎక్కువగా తెలియదు. అక్కడి ప్రకృతి రమణీయతను చూడాలంటే కొండలు, గుట్టలు, బండలు దాటుకొని వ్యయప్రయాసలతో వెళ్లాలి. పర్యాటకుల కోసం ఇప్పటికైనా రోడ్డు సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే ‘oktelugu.com’ కష్టమైనా.. ఈ బుగ్గ జలపాతాన్ని సందర్శించింది. వ్యయప్రయాసలకోర్చి అక్కడి ప్రకృతి రమణీయతను కెమెరాలో బంధించింది. అది ప్రేక్షక లోకానికి చూపించింది. అక్కడి విభిన్న రుచులను పరిచయం చేసింది. మా ఈ అలుపెరగని ప్రయాణంలో మీరు భాగస్వాములు కావాలంటే ఇప్పుడే.. ‘OkTelugu Food & Travel’ యూట్యూబ్ చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మాతో ప్రయాణించండి..

మా ఈ ప్రయాణంలో మీకు ఆశ్చర్యకర అనుభూతులను పంచుతాం.. ఎన్నో వింతలు, విశేషాలు మీకు పరిచయం చేస్తాం. .. వాటన్నింటిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది మా ‘‘Oktelugu ఫుడ్ అండ్ ట్రావెల్ యూట్యూబ్ చానెల్’’. ఎప్పుడూ చూడని పల్లెలు.. నగరాల్లోని కొత్త అందాలు.. అక్కడి వింతైన వంటకాలను మేం మీకు పరిచయం చేయబోతున్నాం..

ఏపీ, తెలంగాణ నుంచి మొదలుపెట్టే మా ప్రయాణం.. రాష్ట్రాలు, దేశాలు కూడా దాటొచ్చు. ఫుడ్ లవర్స్, పర్యాటకులు అంతా  ‘‘ఓకే తెలుగు ‘ఫుడ్ అండ్ ట్రావెల్’’’ యూట్యూబ్ చానెల్ ను ఇప్పుడే సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మాతో భాగస్వాములు కండి..

Bugga Water Falls Ajilapuram || Adventurous Trip ||  Nalgonda Episode 1 || Ok Telugu Food & Travel

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version