https://oktelugu.com/

Pushpa 2 Item Song: పుష్ప 2 లో ఐటెం సాంగ్… బన్నీతో కాలు కదపనున్న దేశాన్ని కుదిపేసిన హీరోయిన్!

పుష్ప చిత్ర సక్సెస్ లో సమంత భాగమైన సంగతి తెలిసిందే. 'ఊ అంటావా మామా' సాంగ్ లో సమంత పెరఫార్మెన్సు పీక్స్ అని చెప్పాలి. మగాళ్ల వంకర బుద్ధి తెలియజేస్తూ ఆ సాంగ్ లో సమంత హాట్ స్టెప్స్ తో అల్లాడించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 24, 2024 / 03:51 PM IST

    Tripti Dimri doing an item song in Pushpa 2

    Follow us on

    Pushpa 2 Item Song: అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ పుష్ప 2లో ఈ స్థాయిలో బజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది. అన్ని హక్కులు కలుపుకుని పుష్ప 2 రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. పుష్ప 2 చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 350 కోట్లు. పుష్ప 2 జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మాతలకు భారీగా లాభాలు అందాయి.

    కాగా పుష్ప చిత్ర సక్సెస్ లో సమంత భాగమైన సంగతి తెలిసిందే. ‘ఊ అంటావా మామా’ సాంగ్ లో సమంత పెరఫార్మెన్సు పీక్స్ అని చెప్పాలి. మగాళ్ల వంకర బుద్ధి తెలియజేస్తూ ఆ సాంగ్ లో సమంత హాట్ స్టెప్స్ తో అల్లాడించింది. సమంత మమేకమై నటించిన ఆ ఐటెం సాంగ్ పుష్ప చిత్ర హైలెట్స్ లో ఒకటి. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణ కాగా… పుష్ప 2 కోసం కూడా ఐటెం సాంగ్ సిద్ధం చేస్తున్నారు.

    పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ కి సమంత ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈసారి ఎవరు ఆ ఐటెం సాంగ్ చేస్తారనే ఆత్రుత అందరిలో ఉంది. దర్శకుడు సుకుమార్ ఓ క్రేజీ హీరోయిన్ ని పట్టుకొచ్చాడని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు త్రిప్తి దిమ్రి. యానిమల్ మూవీలో గెస్ట్ రోల్ చేసిన త్రిప్తి దిమ్రి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆమె నగ్నంగా నటించి పతాక శీర్షికలకు ఎక్కింది. హీరోయిన్ రష్మిక మందాన కంటే కూడా యానిమల్ విషయంలో త్రిప్తి దిమ్రి పేరు గట్టిగా వినిపించింది.

    ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన త్రిప్తి దిమ్రి ని సుకుమార్ ఎంపిక చేశాడట. పుష్ప 2లో అల్లు అర్జున్ కి జంటగా త్రిప్తి దిమ్రి కాలు కడపనుందట. పుష్ప 2 పై హైప్ ని ఈ పరిణామం మరింత పెంచేసింది. ఇక ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా… ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నాడు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.