https://oktelugu.com/

Katrina Kaif: కత్రినా- విక్కీ వివాహ వేడుకలో సెలబ్రిటీలకు కఠినమైన రూల్స్​.. అవేంటో తెలిస్తే షాక్​?

Katrina Kaif: బాలీవుడ్​ ప్రేమ జంట కత్రినా కైఫ్​- విక్కీ కౌశల్​ల వివాహం గురించి గత కొంతకాలంగా సోషల్​మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరు 9న వీరిద్దరు రాజస్థాన్​లో ఓ రాజభవనంలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వీరి వివాహంలో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరవనున్న నేపథ్యంలో.. అతిథులకు పలు నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం. పెళ్లికి వచ్చే ప్రతి అతిథి NDA నిబంధనపై సంతకం చేయాలి. వారికి ప్రత్యేకమైన కోడ్ ను కూడా ఇస్తారట. అంతేకాదు సెలెబ్రెటీలకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 10:20 AM IST
    Follow us on

    Katrina Kaif: బాలీవుడ్​ ప్రేమ జంట కత్రినా కైఫ్​- విక్కీ కౌశల్​ల వివాహం గురించి గత కొంతకాలంగా సోషల్​మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరు 9న వీరిద్దరు రాజస్థాన్​లో ఓ రాజభవనంలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వీరి వివాహంలో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరవనున్న నేపథ్యంలో.. అతిథులకు పలు నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం. పెళ్లికి వచ్చే ప్రతి అతిథి NDA నిబంధనపై సంతకం చేయాలి. వారికి ప్రత్యేకమైన కోడ్ ను కూడా ఇస్తారట. అంతేకాదు సెలెబ్రెటీలకు షరతులు కూడా విధిస్తున్నారట ఈ లవ్ బర్డ్స్. స్పష్టంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్‌లకు, ఫోటోలకు, లొకేషన్ షేరింగ్ వంటి వాటికి అనుమతి లేదు.

    trict-rules-for-celebrities-at-katrina-and-vickys-wedding

    అంతే కాదు.. వివాహానికి హాజరవుతున్న సంగతి ఎవ్వరికీ వెల్లడించకూడదట. సోషల్​ మీడియాలో వారితో దిగిన ఫొటోలను పోస్ట్​ చేయకూడదట. సింపుల్​గా చెప్పాలంటే.. వచ్చిన అతిథులు తిరిగి వెళ్లేవరకు బాహ్యప్రపంచంతో సంబంధాలు ఉండవని తెలుస్తోంది. వెడ్డింగ్​ ప్లానర్ల నుండి అనుమతి తీసుకున్న తర్వాతే.. ఫొటోలు షేర్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహం వేడుకలో ఎలాంటి వీడియోలు కానీ, రీల్స్ కానీ తీయకూడదని నిబంధన విధించనున్నారట.

    Also Read: హైదరాబాద్​కు దీపికా.. ప్రభాస్​ సినిమా షూటింగ్​ కోసమేనట?

    పెళ్లి గురించి ఎటువంటి లీక్స్ రాకుండా డ్రోన్​లు ఏమైనా కనిపిస్తే.. వెంటనే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ హక్కులను ఓ అంతర్జాతీయ మ్యాగజైన్‌కు విక్రయించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం మళ్లీ కొవిడ్​ వేరియంట్​ ఒమిక్రాన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో.. అతిథుల జాబితాను మళ్లీ పరిశీలుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే అతిథులను తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారట. ఏదేమైనా వీరిద్దరి  వివాహం ఓ కట్టుదిట్టమైన చర్యలతో.. అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది.

    Also Read: బాలీవుడ్​లో రెండు సినిమాలకు ఓకే చెప్పిన అడవి శేష్