https://oktelugu.com/

Star Heroes: మనం మనం భాయ్ భాయ్… స్టార్ హీరోలందరూ కలిసిపోయారా!

Star Heroes: సినిమా కళాత్మక వ్యాపారం. ఒక సినిమాపై అనేక మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా నిర్మాత బాగుంటేనే చిత్రాలు తెరకెక్కుతాయి. నిర్మాత బాగుండాలంటే సినిమాలు థియేటర్స్ లో ఆడాలి. పెట్టుబడి తో పాటు లాభాలు దక్కాలి. దీనికి ప్రమోషన్స్ చాలా అవసరం. చిత్ర పరిశ్రమ కరోనా మహమ్మారి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంది. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు ఓటీటీ సంస్థల నుండి తీవ్ర పోటీ నెలకొని ఉంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 4, 2021 / 10:17 AM IST
    Follow us on

    Star Heroes: సినిమా కళాత్మక వ్యాపారం. ఒక సినిమాపై అనేక మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా నిర్మాత బాగుంటేనే చిత్రాలు తెరకెక్కుతాయి. నిర్మాత బాగుండాలంటే సినిమాలు థియేటర్స్ లో ఆడాలి. పెట్టుబడి తో పాటు లాభాలు దక్కాలి. దీనికి ప్రమోషన్స్ చాలా అవసరం. చిత్ర పరిశ్రమ కరోనా మహమ్మారి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంది. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

    Star Heroes

    మరోవైపు ఓటీటీ సంస్థల నుండి తీవ్ర పోటీ నెలకొని ఉంది. స్టార్ హీరోల సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయడం వలన దక్కే ఫలితం చాలా తక్కువ. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఖచ్చితంగా థియేటర్స్ లో విడుదల కావాల్సిందే. ఈ నేపథ్యంలో సినిమా మనుగడ కోసం స్టార్స్ ఓ మంచి సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. పరిశ్రమ కోసం ఒకరికి మరొకరు సాయం చేసుకోవాలి, అండగా నిలబడాలనే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నారు.

    ఒకప్పుడు స్టార్ హీరోల మధ్య చెప్పుకునేంత సాన్నిహిత్యం ఉండేది కాదు. ఒక హీరో ఫ్యాన్స్ కి మరో హీరో అంటే ఎలా నచ్చదో.. అలాగే హీరోలు కూడా డిస్టెన్స్ మైంటైన్ చేసేవారు. మన హీరోలు దీనికి స్వస్తి చెప్పారు. తమ ప్రత్యర్థి హీరోల సినిమాలకు మాట సాయం చేస్తున్నారు. ఆ సినిమా తమ ఫ్యాన్స్ కూడా చూసేలా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

    సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి గెస్ట్ గా రావడం ఎవరూ ఊహించని పరిణామం. ఆ సినిమాకు పోటీగా మెగా హీరో అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో మూవీ విడుదల ఉండగా.. చిరంజీవి మహేష్ మూవీకి ప్రచారం కల్పించారు. అలాగే లేటెస్ట్ గా అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ రావడం మరొక షాకింగ్ పరిణామం.ఒకప్పుడు మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య పచ్చి గడ్డి వేస్తే మండే పరిస్థితులు మనం చూశాం. అలాంటిది బన్నీ బాలయ్య మూవీని ప్రమోట్ చేయడం గొప్ప విషయం.

    Also Read: Akhanda: బాలయ్య అఖండ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది ఎవరంటే…

    అంతే కాకుండా ఓ మూవీ రిలీజ్ అయితే.. సినిమా బాగుంది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అఖండ అద్భుతం అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కూడా బాలయ్య మూవీ గురించి ట్వీట్ చేశారు. ఇది ఆరోగ్యకర పరిణామం అని చెప్పాలి. ఓ స్టార్ హీరో ఏ రూపంలో సినిమాను ప్రమోట్ చేసినా, అది ప్రయోజనం చేకూర్చే అంశమే. అదే సమయంలో స్టార్స్ మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి ఇది దారి తీస్తుంది.

    Also Read: Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో టికెట్ టు ఫీనాలే గెలిచింది అతడే…

    Tags