Bheemla Nayak Pre Release Event: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే టిక్కెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుకకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నిజానికి ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారమే జరగాల్సి ఉంది. కానీ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా చిత్ర నిర్మాతలు ఈ వేడుకను బుధవారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కొత్త పాసులు జారీ చేశారు.
Also Read: దీపికా పదుకొణె పెళ్లి అయ్యాక ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి?
అయితే యూసఫ్‌గూడ ప్రాంతం నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. భీమ్లానాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండటం, అందులోనూ పవర్‌స్టార్ మూవీ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమీర్‌పేట మైత్రీవనం నుంచి యూసుఫ్ గూడ వైపు నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేయనున్నారు. ఆయా వాహనాలను సవేరా ఫంక్షన్ హాల్, కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమాగమం, కృష్టానగర్ మీదుగా మళ్లించనున్నారు.

అలాగే జూబ్లీహల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడ వైపు వెళ్లే వాహనాలను శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమాగమం వైపు మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ఈ ఆంక్షలను గమనించాలని పోలీసులు కోరారు. మరోవైపు ఈ వేడుకకు వచ్చేవారి వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా పోలీసులు వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు వచ్చే వారు సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడయం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ చేయాలని సూచించారు.
Also Read: సినీ నటుడు నరేష్ భార్య ఘరానా మోసం!
Recommended Video:
[…] Gopichand: హీరో తొట్టెంపూడి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలివలపు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసినా ఆ సినిమా సరైన బ్రేక్ ఇవ్వలేదు. దీంతో ఆ తర్వాత విలన్‌గా మారాడు. తేజ దర్శకత్వం వహించిన జయం మూవీలో విలన్‌గా మంచి పేరు రావడంతో వరుసగా విలన్‌గా అవకాశాలు పలకరించాయి. దీంతో ప్రభాస్ వర్షం, మహేష్‌బాబు నిజం సినిమాల్లోనూ గోపీచంద్ విలన్‌గా నటించాడు. […]
[…] Pawan Kalyan Hits And Flops: తెలుగు ఇండస్ట్రీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినా అనతికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని యూత్‌కు ఐకాన్‌గా మారిపోయాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసి వరుసగా ఏడు హిట్లు కొట్టిన ఘనత పవన్‌కళ్యాణ్‌కే చెందుతుంది. […]
[…] Also Read: భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వె… […]
[…] Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. చనిపోయిన తన కుమారుడు గుర్తొచ్చి ప్రముఖ నటుడు బాబు మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. తనయుడి మరణాన్ని జీర్ణించుకోలేక అస్థిపంజరంలా మారానని, ఒకానొక సమయంలో చనిపోవాలనుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంబంధిత ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. బాబు మోహన్‌తోపాటు సీనియర్ నటీమణులు అన్నపూర్ణ, శ్రీలక్ష్మి తదితరులు ఈ షోకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. […]