https://oktelugu.com/

Tollywood : పవన్ కళ్యాన్ కొడుకు అకీరా నందన్, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ, అల్లు అర్జున్ కొడుకు అయాన్ లా ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక దానికోసమే పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన హీరోలు కొంత మంది మాత్రమే ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 01:40 PM IST

    Tollywood

    Follow us on

    Tollywood :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్… ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకల్లో విపరీతమైన అంచనాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నాడు…అయినప్పటికి వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఈయన కొడుకు అయిన అకిరా నందన్ కూడా తొందర్లోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు. ఈయన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడంతో ఆయన తనకంటూ గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు కొడుకు అయినా గౌతమ్ కృష్ణ కూడా మహేష్ బాబు చేసిన వన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటింపజేశాడు. తన నటన ప్రతిభను బయటకు తీసి ప్రేక్షకులందరిని మెప్పించేలా చేశాడు. ఇక ప్రస్తుతం గౌతమ్ కృష్ణ యాక్టింగ్ కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తొందర్లోనే ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

    ఇక ఐకాన్ స్టార్ గా తనదైన రీతిలో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…ఈయన ప్రస్తుతం పాన్ ఇండియాలో దుమ్ము రేపుతున్నాడు. తొందర్లోనే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయన ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటడానికి అసక్తి చూపిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకునే ముందు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కొడుకు అయిన అయాన్ చిన్న పిల్లోడే అయినప్పటికి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. వాళ్ళ నాన్న సాంగ్స్ కి డాన్స్ వేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ ముగ్గురు స్టార్ హీరోల వారసులు కూడా తమ ఫేవరెట్ హీరోలు ఎవరు అని అడిగితే వాళ్ల ఫాదర్స్ పేర్లు చెప్పకుండా వేరే ఒక స్టార్ హీరో పేరు చెప్పారనే విషయం మనలో చాలామందికి తెలియదు…

    నిజానికి అకిరా నందన్, గౌతమ్ కృష్ణ, అయాన్ ముగ్గురు కూడా ప్రభాస్ కి డై హార్ట్ ఫ్యాన్స్ అట. మరి వీళ్ళు ముగ్గురు ప్రభాస్ ని అంతలా ఇష్టపడడానికి కారణం ఏంటి అంటే ఆయన సినిమాల్లోని నటన అలాగే ఆయన కటౌట్ అంటే కూడా వీళ్లకు చాలా ఇష్టమని అందువల్లే వీళ్ళు ప్రభాస్ ని అభిమానిస్తున్నారంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది…