Toxic teaser controversy: KGF హీరో యాష్(Rocking Star Yash) లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్”(Toxic Movie) కి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే యాష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశంలో ఇప్పటి వరకు మూవీ లవర్స్ ఎప్పుడూ చూడని యాక్షన్ సన్నివేశాలను ఈ టీజర్ లో చూపించడం తో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. ఒక మహిళ అయ్యుండి ఇలాంటి సన్నివేశాలను ఎలా ఆలోచించింది, ఆశ్చర్యం గా ఉంది అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు మాట్లాడుకున్నారు. అయితే ఈ టీజర్ లోని ఇంటిమేట్ సన్నివేశం లో నటించిన అమ్మాయి పేరు బీట్రీజ్ టోఫెన్ బాఖ్. ఇన్ స్టాగ్రామ్ లో ఈ సన్నివేశం గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకోవడం, బీట్రీజ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసింది.
టీజర్ విడుదలైన తర్వాత ఎవరు ఈ అమ్మాయి?, కచ్చితంగా తెలుసుకోవాల్సిందే అని సోషల్ మీడియా లో వెతకడం మొదలు పెట్టారు. కానీ ఇంతలోపే ఆ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ బీట్రీజ్ కి సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఏమైందో ఏమో తెలియదు కానీ బీట్రీజ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసి వెళ్ళిపోయింది. ఈమె హాలీవుడ్ వెబ్ సిరీస్ బ్రూక్లిన్ నైన్ – నైన్ తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అదే విధంగా డిస్నీ సంస్థ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం లో ఒక క్యారక్టర్ కి వాయిస్ ని అందించింది. జనవరి 13 వ తేదీ వరకు ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్డ్ గా కనిపిస్తూ వచ్చిన ఈమె, డైరెక్టర్ వివరాలు చేయడం తో ఏకంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నే తొలగించడం చర్చినీయాంసంగా మారింది.
ఇది ఇలా ఉండగా టాక్సిక్ చిత్రం టీజర్ పై మరో వివాదం తీవ్రమైన దుమారం రేపింది. ఈ టీజర్ లోని ఇంటిమేట్ సన్నివేశం పై విమర్శలు తారా స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా అస్లీల సన్నివేశాలపై కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేశారు. దీంతో రంగం లోకి దిగిన మహిళా కమీషన్, ఈ వివాదం పై తగిన చర్యలు తీసుకోవాలంటూ సెన్సార్ బోర్డు కి లేఖ రాసింది. దీనిపై స్పందించిన సెన్సార్ బోర్డు మెంబెర్స్ యూట్యూబ్ లో విడుదల చేసే వీడియోలకు ఎలాంటి సెన్సార్ అవసరం లేదని చెప్పింది. మరి సినిమాలో ఈ సన్నివేశం ఉంటుందా లేదా అనేది చూడాలి. హైప్ కారణమయ్యే సన్నివేశాలు ని తొలగిస్తే యూత్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రాన్ని మార్చ్ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.