Dhurandhar 2 Vs Toxic Clash: పాన్ ఇండియా లెవెల్ లో మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్'(Toxic Movie), ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రాలు వచ్చే నెల 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్నాయి. అయితే ‘ధురంధర్’ చిత్రం గత ఏడాది విడుదలై 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు రాబట్టి సంచలనం సృష్టించింది కదా , ఆ సినిమా సీక్వెల్ తో పోటీ పడడం అంటే డైనోసర్ ముందు చిట్టి ఎలుక కుప్పిగంతులు ఏసినట్టు , నలిగిపోతారు , క్లాష్ నుండి తప్పుకోవడం బెటర్ , ‘టాక్సిక్’ చిత్రం కచ్చితంగా వాయిదా పడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ‘టాక్సిక్’ దెబ్బకు ‘ధురంధర్ 2 ‘ వాయిదా పడనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ‘టాక్సిక్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
మరోపక్క ‘ధురంధర్ 2’ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. షూటింగ్ స్పాట్ లో వేసిన పాకిస్థాన్ సెట్స్ లో షూటింగ్ చేసుకోవడానికి లేదని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ బ్యాన్ చేయడం తో రెండు వారాల నుండి షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభించి , దానిని పూర్తి చేసి , విడుదల చేయడం దాదాపుగా అసాధ్యం ని అంటున్నారు. మరో పక్క థియేటర్స్ విషయం లో కూడా ‘టాక్సిక్’ చిత్రం ‘ధురంధర్ 2’ చిత్రాన్ని అరుణంగా తొక్కేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ‘టాక్సిక్ ‘ చిత్రాన్ని మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా 6000 థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అగ్రీమెంట్స్ కూడా జరిగిపోయాయి అట. మరోపక్క ‘ధురంధర్ 2’ చిత్రానికి కేవలం 4000 థియేటర్స్ మాత్రమే దక్కే అవకాశం ఉంది. సౌత్ లో అయితే ఈ సినిమాకు అసలు థియేటర్స్ దొరికే అవకాశమే లేదు. ఆ రేంజ్ తొక్కే ప్లాన్ లో ఉన్నారు టాక్సిక్ మేకర్స్.
బయ్యర్స్ ని కూడా ప్రాంతాల వారీగా బలమైన వాళ్ళను ఎంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయబోతున్నాడు. అదే విధంగా కర్ణాటక , తమిళనాడు ప్రాంతాల్లో క్వీన్ ప్రొడక్షన్స్ అమ్మేస్తా విడుదల చేయబోతుండగా , కేరళ లో E4 ఎంటర్టైన్మెంట్స్ , నార్త్ ఇండియా లో AA ఫిలిమ్స్ (అనిల్ తథాని) , ఓవర్సీస్ లో ఫార్స్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. క్లాష్ లో ఈ రేంజ్ డామినేషన్ ని చూపిస్తూ తమ సినిమాని విడుదల చేసుకునేందుకు గట్టి ప్లాన్ వేసుకున్నారు టాక్సిక్ మేకర్స్. మరోవైపు ‘ధురంధర్ 2’ టీం నుండి చప్పుడు లేదు , చూస్తుంటే వాయిదా పక్కా లాగానే ఉంది.