Homeఎంటర్టైన్మెంట్Nani Career Analysis: నాని ఆ ఒక్క విషయంలో క్లారిటీ మెయింటైన్ చేస్తే టైర్ వన్...

Nani Career Analysis: నాని ఆ ఒక్క విషయంలో క్లారిటీ మెయింటైన్ చేస్తే టైర్ వన్ హీరో అవుతాడా..?

Nani Career Analysis: సినిమా ఇండస్ట్రీకి రావాలని స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది అందరివల్ల అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి పడే కష్టాలు మామూలుగా ఉండవు. కొందరు వాటిని భరిస్తూ ముందుకు సాగుతుంటే, మరికొందరు వాటిని ఓర్చుకోలేక ఇండస్ట్రీని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వశక్తి తో ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్లలో చిరంజీవి, రవితేజ తర్వాత స్థానంలో నాని నిలుస్తాడు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేసి న్యాచురల్ స్టార్ గా అవతరించిన నాని హీరోగా నటిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని గొప్ప స్టేజ్ కి తీసుకెళ్లాయి. అలాంటి నాని ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చేసిన దసర సినిమాతో మాస్ హిట్ ని సాధించిన నాని ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు.

ఇక తను ఎప్పటినుంచో టైర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తన తోటి హీరోలందరు ఒక సక్సెస్ ను సాధిస్తే మరో రెండు సినిమాలతో ప్లాప్ లను మూట గట్టుకుంటున్నారు. కానీ నాని మాత్రం వరుస విజయాలను సాధించాలని ఏరుకోరి మరి సినిమాలను చేస్తున్నాడు.

నాని టైర్ వన్ హీరోగా మారకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన దసర లాంటి మాస్ హిట్ తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి క్లాస్ సినిమాలి చేస్తున్నాడు. అలా కాకుండా మాస్ సినిమాలు చేస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలను చేసుకుంటూ వెళ్లాలి. క్లాస్ మాస్ రెండు చేసుకుంటూ వెళ్లడం వల్ల అతను మాస్ హీరోనా, క్లాస్ హీరోనా అనే క్లారిటి ప్రేక్షకుల్లో లేకుండా పోతుంది. తద్వారా కలెక్షన్స్ కూడా భారీగా తగ్గిపోతాయి.

టైర్ వన్ హీరోగా మారాలి అంటే పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో మాస్ సినిమాలను చేస్తూ ఎలివేషన్ భారీ స్థాయిలో ఇచ్చినప్పుడు మాత్రమే అతను మాస్ హీరోగా మారతాడు. ఫైనల్ గా టైర్ వన్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలంటే నాని ఇకమీదట మాస్ హీరో అవతారం ఎత్తి వరుసగా మాస్ సినిమాలు చేసుకుంటూ వెళ్తే మంచిదని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version