Toxic Movie Censor Issues: సెన్సార్ బోర్డు ఈమధ్య కాలం లో చాలా కఠినంగా వ్యవరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏ మాత్రం ఉన్నా సదరు సన్నివేశాలను తొలగించడంలో , లేదా ట్రిమ్ చేయడమో చేస్తుంది. అంతే కాకుండా కొన్ని సినిమాలకు UA సర్టిఫికేట్ రావాల్సి ఉంటే , కొన్ని యాక్షన్ షాట్స్ కారణంగా A సర్టిఫికేట్ ఇచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ కి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికే నిరాకరించారు. మూడు నెలల క్రితం వరకు ఇదంతా మాజీ సీఎం స్టాలిన్ కుట్ర అని అంతా అనుకునేవారు, కానీ ఇప్పుడు స్వయంగా ఆ చిత్రం లోని హీరోనే సీఎం అయ్యారు, అయినప్పటికీ ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ కి నోచుకోలేదంటే పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.
ఇదే సంస్థ లో ‘టాక్సిక్’ చిత్రం కూడా తెరకెక్కింది. ‘KGF ‘ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యాష్ హీరో గా నటిస్తూ , సహనిర్మాతగా కూడా వ్యవహరించిన సినిమా ఇది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ని చూసిన తర్వాత నెటిజెన్స్ లో కలిగిన అనుమానం ఒక్కటే , సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అసలు సర్టిఫికేట్ ఇస్తుందా?, ఆ సన్నివేశాలేంటి బాబోయ్ , ఈ రేంజ్ బోల్డ్ ఉంటే కష్టమని అంటున్నారు. ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ బోల్డ్ గానే ఉంది , యాక్షన్ అంతకంటే బోల్డ్ గా ఉంది. కచ్చితంగా సెన్సార్ సభ్యులు అనేక కట్స్ సూచిస్తారు. అలా వాళ్ళు చెప్పిన కట్స్ మొత్తం విధిస్తే , కనీసం 30 నిమిషాల ఫుటేజీ అయినా మిగులుతుందా అని అంటున్నారు నెటిజెన్స్.
ఈ చిత్రం లో నయనతార, కియారా అద్వానీ , రుక్మిణి వాసంత్, తార సుతారియా , హుమా ఖురేషి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. హీరోయిన్ కియారా అద్వానీ తో యాష్ రొమాన్స్ హద్దులు దాటినట్టు గా అందరికీ అనిపించింది. ఈ సన్నివేశాల్లో సెన్సార్ బోర్డు కట్ వేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ యాష్ సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ ని అంగీకరించకపోతే , ఆయన ఇప్పట్లో ఈ సినిమాని విడుదల చేయరేమో, ఎందుకు KVN ప్రొడక్షన్ సినిమాలకే ఇలా జరుగుతోంది పాపం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఆగస్టు 26 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
