
Writer Acharya Athreya: 1950-65 మధ్య కాలంలో తెలుగు సినిమాల నిర్మాణంలో విపరీతమైన వేగం పెరిగింది. ఆ వేగంలో ఒకటికి పది సార్లు రాసుకుని, రిహార్సల్స్ చేసుకుని సినిమా తీసే అలవాటును అప్పుడప్పుడే మర్చిపోతున్న రోజులు అవి. ఆ కాలంలోనే ఆలస్యానికి పర్యాయపదం లాంటి ఆత్రేయ స్టార్ రైటర్ గా ఎదిగారు. అయితే ఆయన సక్సెస్ మంత్రం నాణ్యతే. ‘సరైన పదం పడకపోతే గిలగిలా కొట్టుకునేవాడిని’ అంటూ ఆయనే తన గురించి చెప్పేవారు.
కానీ, ఆత్రేయకు (Aatreya) రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాడు అనే చెడ్డ పేరు వచ్చింది. ఎంత చెడ్డ పేరు వచ్చినా.. ఆచార్య ఆత్రేయ అగ్ర రచయితగానే తెలుగు సినిమా రంగాన్ని ఆ రోజుల్లో ఏలారు. ఆత్రేయ జనం నాడి పట్టుకుని కథలు పాటలు రాసేవారు. అయితే, ఆయన మాత్రం తన కెరీర్ లో చాల తక్కువ మాత్రమే పని చేశారు.
నిజమే, బద్ధకంలో, మరుపులో, వాయిదా వేయడం వంటి వాటిల్లో ఆత్రేయ గారు సుప్రసిద్ధమే. ఆ మహా రచయితకు చెడ్డ పేరు రావడానికి కారణం ఒక సంఘటన ఉంది. తెలుగు సినిమా రచయితల సంఘం పేరిట ఆత్రేయ ఆ రోజుల్లో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి అందర్నీ ఆహ్వానించారు.
ఆత్రేయ మాట కాదు అనలేక పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చారు. కానీ తీరా చూస్తే.. ఆ సమావేశానికి ఆత్రేయ హాజరుకాలేదు. ఇది ఆత్రేయ శైలి. రాస్తాను, రాస్తాను అని చెప్పి రాయకుండా పోయిన సినిమాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఐతే, ఆత్రేయ రచనలో ఉన్న ఒక గుణం ఉంది, వేగంగా పుంజుకుంటున్న యుగంలో తెలుగు సినిమాల అవసరానికి సరిపోయేట్టు ఆయన రచన ఉండేది.
పైగా అతి సామాన్యులకు సైతం సినిమాను సరిపోయేలా రాయడం ఆత్రేయకు ఉన్న గొప్పతనం. లేకపోతే, నేను పుట్టాను – ఈ లోకం మెచ్చింది. నేను నవ్వాను – ఈ లోకం ఏడ్చింది. నేను ఏడ్చాను – ఈ లోకం నవ్వింది. అంటూ ఎలా రాయగలడు. ఏది ఏమైనా మళ్ళీ మరో ఆత్రేయ నేటి తెలుగు సినిమాకు అవసరం.