Pooja Hegde: సౌత్ ఇండియా లో ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వరుణ్ తేజ్ హీరో గా నటించిన ముకుంద సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ అమ్మాయి అతి తక్కువ సమయం లోనే పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది..రెండవ సినిమా తోనే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరో గా నటించిన మోహెన్ జోదారో సినిమాలో హీరోయిన్ గా నటించే రేంజ్ కి ఎదిగిన ఈమె ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా మారింది..కానీ ఇటీవల ఈమె హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ మరియు బీస్ట్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయాలుగా నిలిచాయి..వరుస హిట్స్ తో మంచి ఊపు మీదున్న పూజ హెగ్డే సక్సెస్ స్ట్రీక్ కి ఈ రెండు సినిమాలు బ్రేక్ వేసాయి..అయినా కూడా ఈ హీరోయిన్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు..కానీ ఇటీవల పూజ హెగ్డే గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త అందరిని షాక్ కి గురి చేస్తోంది.

Also Read: Anchor Pradeep- Prasad: యాంకర్ ప్రదీప్ అసలు క్యారెక్టర్ బయటపెట్టిన ఢీ మాజీ కంటెస్టెంట్!
ఇక అసలు విషయానికి వస్తే పూజ హెగ్డే ఒక్కో సినిమాకి 4 నుండి 5 కోట్ల రూపాయిల వరుకు పారితోషికం తీసుకునే సంగతి మన అందరికి తెలిసిందే..ఈమె షూటింగ్ సెట్స్ లో ఉన్నంత సేపు ఆమె స్టాఫ్ కి ఖర్చు అయ్యే డబ్బులు కూడా నిర్మాతనే ఇవ్వాలట..ఇటీవలే ఈమె తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమా షూటింగ్ కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో తన స్టాఫ్ తో సహా దిగిపోయింది..ఇక్కడ ఈమె స్టాఫ్ తిండి ఖర్చులే లక్షల్లో అయ్యిందట..హోటల్ యాజమాన్యం పూజ హెగ్డే ఖర్చు చేసిన బిల్లులు ఇటీవలే బీస్ట్ చిత్ర నిర్మాతకి పంపారట..ఈ బిల్ ని చూసిన వెంటనే నిర్మాతకి గుండె జారీ ప్యాంటు లోకి వచ్చినంత పని అయ్యిందట..అసలే సినిమా ఫ్లాప్ అయ్యి బాధల్లో ఉన్న ఆ నిర్మాత ఈ బిల్లులు నేను కట్టలేను..వెంటనే పూజ హెగ్డే కి పంపి కట్టమని చెప్పండి అంటూ తన స్టాఫ్ కి చెప్పాడట..ఆయన చెప్పినట్టే పూజ హెగ్డే కి బిల్లులను పంపారట..మరి ఆమె కట్టిందో లేదో తెలియదు కానీ ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ప్రస్తుతం పూజ హెగ్డే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో పాటు విజయ్ దేవరకొండ తో ఒక సినిమా..అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో కూడా నటించబోతుంది..వీటితో పాటు ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది..ఇందులో మన టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Also Read: Manchu Lakshmi Yoga: నీకు అవసరమా బామ్మా అంటూ మంచు లక్ష్మిని ఆడేసుకున్నారు… ఇంతకీ ఆమె ఏం చేశారంటే!

[…] Also Read: Pooja Hegde: నీ బిల్లు నువ్వే కట్టుకో అని పూజ … […]