Senior Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు సైతం యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలను చేస్తుండటం విశేషం… వాళ్ళ నుంచి వచ్చే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాయి… ఇక ఇలాంటి క్రమంలోనే ప్రతి ఒక్క స్టార్ హీరో తనను తాను స్టార్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో సీనియర్ హీరోలు మాత్రం మంచి సబ్జెక్టులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…ఇక చిరంజీవి కమర్షియల్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం… బాలయ్య బాబు కి మాస్ ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాబట్టి అదే తరహాలో సినిమాలను చేస్తున్నాడు. నాగార్జున తన వందో సినిమాని డిఫరెంట్ గా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక వెంకటేష్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు… ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి ఏ హీరో టాప్ పొజిషన్లో ఉన్నాడు అనే విషయం మీద తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు సీనియర్ హీరోలెవరు 300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టలేదు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు. ప్రస్తుతం సీనియర్ హీరోలందరి కంటే తను టాప్ పొజిషన్లో ఉన్నాడనే చెప్పాలి…
బాలయ్య సైతం వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘అఖండ 2’ మూవీ ఫ్లాప్ అయినప్పటికి ఆయన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. చిరంజీవి సైతం 200 కోట్లు మార్కును టచ్ చేశాడు. కాబట్టి తను కూడా ఈ రేస్ లో చాలా వరకు ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి.
ఇక నాగార్జున గత కొన్ని సంవత్సరాలు నుంచి సరైన సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు. కాబట్టి సీనియర్ హీరోలందరిలో తను చాలా వరకు వెనుకబడి ఉన్నాడు. తన వందో సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి సీనియర్ హీరోల్లో టాప్ పొజిషన్ కి చేరుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…