Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా కొనసాగుతుంది. వాళ్ళ నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ రికార్డుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసిస్తున్న వాళ్లలో రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలు మొదటి స్థానంలో ఉంటారు. ఇక అలాంటి హీరోలు సైతం కొన్ని సార్లు బొక్క బోర్ల పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం సంక్రాంతి సీజన్ కి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు.
ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన రాజాసాబ్ సినిమా విషయంలో ప్రభాస్ సైతం అలాంటి ఒక ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉండడం గతంలోను జరిగింది. గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన రామ్ చరణ్ సినిమాతో ఢీ కొట్టి మరీ సక్సెస్ ని సాధించాడు.
ఇక ఈసారి ప్రభాస్ సినిమాను ఢీ కొట్టి విజయాన్ని అందుకోవడానికి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో మరోసారి సిద్ధమయ్యాడు. ఇక అనిల్ రావిపూడి సినిమాల ముందు స్టార్ హీరోల సినిమాలు కూడా నిలబడలేకపోతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడంలో 100% సక్సెస్ అవుతున్నాడు. అందువల్లే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అతనికి సపోర్ట్ చేస్తూ అతని సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు…
ఇక ఈసారి కనుక అతను మంచి విజయాన్ని సాధించి మన శంకర వరప్రసాద్ సినిమాని సక్సెస్ గా నిలిపితే మరోసారి సంక్రాంతి కి దర్శకుడుగా నిలుస్తాడు…ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తోంది అనేది తెలియాలంటే మరికొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…