Actress Vani Sri: తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి టాప్ హీరోయిన్లలో వాణిశ్రీ ఒకరు. మొదట్లో చెలికత్తెగా నటించిన వాణిశ్రీ ఆ తరువాత టాప్ హీరోయిన్ అయ్యారు. మిగతా హీరోయిన్లు ఆమెతో పోటీపడి నటించేవారు. రంగుల కెమెరా లేకపోయినా ఆమె అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అయితే వాణిశ్రీ కోసం పెద్ద పెద్ద హీరోలు సైతం వెయిట్ చేశారట. ఆమె సినిమా సెట్ కు లేటుగా వచ్చినా హీరోలు సర్దుకుపోయేవారట. ఈ విషయాన్ని అలనాటి హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న చంద్రమోహన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పిన మరిన్నీ ఆసక్తికర విషయాలేంటో చూద్దాం..

1968లో ‘రంగుల రాట్నం’ సినిమా తీశారు బీఎన్ రెడ్డి డైరెక్టర్. ఈ సినిమా కోసం చంద్రమోహన్ హీరోగా.. వాణిశ్రీని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే అప్పటి వరకు జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తున్న వాణిశ్రీని హీరోయిన్ గా ఒప్పుకోలేదట. ఈ సందర్భంగా చంద్రమోహన్ తన జీవితంలో జరిగిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘బీఎన్ రెడ్డిగారు వాణిశ్రీని నా పక్కన హీరోయిన్ గా బుక్ చేశారు. అప్పటి వరకు జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది ఆమె. పద్మనాభం పక్కన కామెడీ వేశాలు చేస్తున్న వాణిశ్రీ హీరోయిన్ అంటే నచ్చలేదు. హీరోగా ఇది నా ఫస్ట్ మూవీ. కానీ వాణిశ్రీ జూనియర్ ఆర్టిస్టులా ఉంది. ఆమె ఈ సినిమాలో హీరోయిన్ గా వద్దండి.’ అని చెప్పాను. కానీ ఆయన ‘భవిష్యత్తులో ఆమెతో నటించడానికి హీరోలు క్యూ కడుతారు..’ అని అన్నారు. కానీ చంద్రమోహన్ ‘ఏం మట్లాడుతున్నార్ సార్.. ఆమె వేస్తున్న వేశాలేంటి..?’ అని అన్నారు. దీంతో ‘కచ్చితంగా ఆమె టాప్ హీరోయిన్ అవుతుంది’ అని బీఎన్ రెడ్డి అన్నారు.

Also Read: ఆ అందాల హీరో నాశనానికి కారణం.. ఎస్వీయార్ స్నేహమే
‘అయితే బీఎన్ రెడ్డి చెప్పినట్లే వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా మారింది. ఆమెతో నటించడానికి టాప్ హీరోలు సైతం క్యూ కట్టారు. అక్కినేని నాగేశ్వర్ రావు సైతం ఆమె కోసం సెట్లో వెయిట్ చేసిన సందర్భాలున్నాయి. నాగేశ్వర్ రావుతో ‘సెక్రటరీ’ సినిమా చేస్తున్నాం. ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంది. దానిని ఎన్టీరామారావు చేత ఓపెన్ చేయించారు.’

‘సెక్రటరీ’ సినిమా అందులోనే మొదలు పెట్టారు. రాఘవేంద్ర రావు తండ్రి ప్రకాశ్ రావు ఆ సినిమా డైరెక్టర్. ఆ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్. అయితే 9గంటల కాల్ షీట్ కు వాణిశ్రీ 11 గంటలకు వచ్చేది. నేను అందులో నటించాను. నాగేశ్వర్ రావుతో సహా అందరూ వాణిశ్రీ కోసం బయట వెయిట్ చేశాం. ఆమె రాగానే ‘కొంచె లేటైందండి.. ’ అనగానే నాగేశ్వర్ రావు గారు ‘పర్లేదమ్మా’ అనేవారు. అలా ఆనాటి టాప్ హీరోయిన్లను వెయిట్ చేయించింది’ అని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.
Also Read: సూర్యకాంతం గయ్యాళి అత్త కంటే ముందు డ్యాన్సర్ కూడా !